ప్రయోక్త :- కావలి పట్టణ మాజీ కౌన్సిలర్లు మరియు వార్డ్ ఇంచార్జ్ లకు, జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, ఎంపీటీసీ లకు, గ్రామ సర్పంచ్ లకు వైఎస్ఆర్సిపి నాయకులకు మరియు కార్యకర్తలకు ముఖ్య గమనిక :
*మానవ సేవయే మాధవ సేవ* అని పెద్దలు చెప్పిన సూక్తికి నిదర్శనం గా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకొని వారికి తోడుగా నిలబడదాం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అందరూ ఇంట్లోనే ఉంటూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు పెట్టుకుంటూ జాగ్రత్తగా ఉండవలెను. అంతే కాకుండా ప్రభుత్వ ఆదేశానుసారం 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకోవాల్సిందిగా మనవి.
ఎవరికైనా మీ గ్రామంలో గాని పట్టణంలో గాని కరోనా సోకిన వెంటనే అలసత్వం వహించకుండా ముందుగా హాస్పిటల్ కి వెళ్లి వైద్య సహాయం అందే విధముగా కృషి చేయవలసిందిగా కోరుతున్నాము. ఒక వేళ కరోనా సోకి ఇబ్బంది పడుతూ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు బెడ్లు ఖాళీ లేవని ఆసుపత్రి సిబ్బంది లేదా యాజమాన్యం ఇబ్బంది పెడుతున్న యెడల అటువంటివారిని గుర్తించి మా క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ మన్నెమాల సుకుమార్ రెడ్డి ( 8008227585) గారిని లేదా మా కార్యాలయ సిబ్బంది బి.రాఘవరెడ్డి (9505801074) గారిని సంప్రదించిన యెడల వారు మీకు తగు సూచనలు చేసి హాస్పిటల్ వారితో మాట్లాడి హాస్పిటల్లో చేర్పించే విధంగా కృషి చేయగలరు.
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజలందరికీ కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ అందరం కలిసికట్టుగా పనిచేసి కరోనా ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది.
సదా మీ సేవలో..
మీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి,
శాసనసభ్యులు, కావలి.
ఫోన్: 9704851115
0 కామెంట్‌లు