ప్రయోక్త :- జులై 6 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్ ల తో
వివిధ అభివృద్ధి పనుల పై సూచనలు చేయడం
జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో అనేక
ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నాం వాటి పై
ప్రత్యేక దృష్టి పెట్టాలి.ఇంకా అనంతపురం
,శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి ల లో 25 శాతం కూడా
పనులు పూర్తికాలేదు,నెల్లూరు, కృష్ణ జిల్లాలలో
80 శాతం పనులు జులై 31 లోపల ఖచ్చితంగా
పూర్తి చేయాలి అని ఆదేశించారు.
కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం ల జిల్లాల
కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.అందరూ
కలెక్టర్ లు  ఆగస్ట్ 31 కి పూర్తిగా పూర్తి చేయాలి.
దానికి తగిన ప్రణాళికలు తయారుచేసుకోవాలి
అని తెలిపారు. క్షేత్ర స్థాయి లో కూడా కలెక్టర్ లు
పరిశీలనలు చేయాలి అని తెలిపారు.
మెదడు, శక్తి ని ఉపయోగించి పని చేయాలని
సూచించారు.
మండలానికి రెండు phc లు,డాక్టర్ లను ఏర్పాటు
చేస్తున్నాం.వారి సేవలు ప్రజలకు అందే విధంగా
చూడాలి అని తెలిపారు. ఈస్ట్ గోదావరి, కడప,నెల్లూరు
జిల్లాల కలెక్టర్ లు ఈ విషయం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
అని ఆదేశించారు.
అన్నీ గ్రామాల్లో ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీ లు డిసెంబరు 21
నాటికి పూర్తి చేయాలి ,దానికి కావాల్సిన స్థల సేకరణ
చేయాలి అని తెలిపారు.
గ్రామ సచివాలయం లను జాయింట్ కలెక్టర్ లు,
కలెక్టర్ లు తనిఖీ చేయాలి అని ప్రత్యేకంగా
కోరుతున్నానని అన్నారు.వారానికి 4 సచివాలయాలు
ఖచ్చితంగా తనిఖీ చేయాలి అని ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే నే సమస్యలు మనకు
తెలుస్తాయి.గత 5 నెలలలో 7 శాతం నుండి 41 శాతం
వరకు మాత్రమే పని తీరు కనపడింది ,పని తీరు
మెరుగు పరుచుకోవాలి అని తెలిపారు.
పరిశీలకు వెళ్ళినపుడు సోషల్ ఆడిట్,కరోనా జాగ్రత్తలు,
ప్రభుత్వ పథకాల నవీకరించిన లిస్ట్ ,వెల్ఫేర్ కాలెండర్,
ప్రభుత్వ ఫోన్ నెంబర్ లు ఉన్నాయా లేదా 1902
ఉందా లేదా 540 సర్వీసులు అందుతున్నాయా లేదా,
ఇంకా 200 సర్వీసులు అందించే అవకాశం ఉంది
అని తెలిపారు. కంప్యూటర్ లు,హార్డ్వేర్ పరికరాలు
పనిచేస్తున్నాయా లేదా,వెళ్ళినప్పుడు గ్రామ సచివాలయం
సిబ్బందికి కౌన్సెలింగ్ ఇవ్వాలి.
ప్రజలను ఆనందంగా ఆహ్వానించి సేవలు అందించాలి.
సమయానికి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి
అని తెలిపారు. ముఖ్యంగా రికార్డులు,బయోమెట్రిక్
రిపోర్టుల ను పరిశీలించాలి అని తెలిపారు.
వాలంటీర్లు వారానికి రెండు రోజులు అయినా
సచివాలయంలో అందుబాటులో ఉండాలి అని
తెలిపారు.
సామాన్య వ్యక్తి కి ఇచ్చే రైస్ కార్డు,ఆరోగ్య శ్రీ కార్డు
లను ఆలస్యం చేయకుండా ఇవ్వాలి అని తెలుపుతూ
ముఖ్యమంత్రి స్థాయి లో వారానికి రెండు సచివాలయం
లను పరిశీలిస్తాను అని తెలిపారు. MLA లు కూడా
ప్రతి రోజు ఒక సచివాలయం పరిశీలించే ప్రయత్నం
చేస్తున్నాం అని అన్నారు.జిల్లా అధికారులు పనితీరు
బాగు లేక మిమ్మల్ని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గా నన్ను
ప్రశ్నించినట్లే అని గుర్తుపెట్టుకోవాలి అని అన్నారు.
దిశ యాప్ ను కూడా పరిశీలించాలి అని గుర్తు చేశారు.
అర్బన్ ఆరోగ్య కేంద్రాలు త్వరగా పూర్తి చేయాలి అని
కోరారు. అర్హులైన వారికి
90 రోజులలో నివాస స్థలాలు ఇచ్చే విధంగా చూడాలి అని
తెలిపారు.