ప్రయోక్త :- నెల్లూరు లో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తించవలసిన పాయింట్ లు నిర్ణయించి ఉన్నారు.
నెల్లూరు ఉత్తరం,నెల్లూరు దక్షిణం పేరుతో
150 మందికి పైగా పోలీసులు వారికి కేటాయించిన
సమయం లో విధులు నిర్వర్తించవలసి ఉంది.
కానీ వాస్తవానికి నెల్లూరు పట్టణంలో ని శివప్రియ
సెంటర్ లో గంట కూడా ట్రాఫిక్ పోలీసు కనపడే
పరిస్థితి లేదు.అక్కడ స్పీడ్ బోర్డ్ లు లేక
పాదచారుల కు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.
వాస్తవానికి పట్టణం లోని అన్నీ ప్రాంతాలలో
తూతూ మంత్రం గానే విధులు నిర్వర్తిస్తున్నారు.
ఉన్న గంట కూడా ఫోటోలు కొట్టే పనిలో ఉంటున్నారు
తప్ప ట్రాఫిక్ కష్టాల పై దృష్టి పెట్టడం లేదు.
పేరుకే నెల్లూరు నగరం ఒక్క సిగ్నల్ లైట్ కూడా
కనపడదు.ఈ పరిస్థితి లో మార్పు రావాలి అని
నెల్లూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు.
21.7.21 న రాత్రి 7 గంటల సమయంలో శివప్రియ
లాడ్జి వద్ద రోడ్ దాటుతున్న పాదచారి పై ఒక బైక్
వేగంగా వచ్చి గుద్దడం జరిగింది. తృటి లో పెద్ద
ప్రమాదం తప్పింది. ఆ బైక్ కు నెంబర్ ప్లేట్ కూడా
లేదు.
ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో
ట్రాఫిక్ పోలీసు కనపడలేదు.స్పీడ్ బోర్డ్
కనపడలేదు.కెమెరా మాత్రం కనపడింది.
కనీసం కెమెరా స్తంభం లాగా ఒక బ్లింక్ లైట్
ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది.
ఇది ఒక ప్రాంత సమస్య కాదు...కూరగాయల
మార్కెట్ వద్ద ఆవులు అడ్డంగా వస్తాయి.
నిత్యం పట్టణాన్ని కెమారాలతో చూస్తూ ఉన్నారు.
అయినా చర్యలు లేవని ప్రజల ఆవేదన.
0 కామెంట్‌లు