ప్రయోక్త : 1) EWS అంటే ఏమిటి ? జ) Economically Weaker Section. కేంద్ర ప్రభుత్వం OC లలో అగ్రవర్ణాలలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్యా, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించింది. 2) EWS వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ? జ) కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే అన్ని కళాశాలల్లో 10% సీట్లు,కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే అన్ని ఉద్యోగాలలో 10% కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యలో,ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. 3) EWS రిజర్వేషన్ పొందడానికి కావలసిన అర్హతలు ఏమిటి ? జ) 1) కుటుంబ ఆదాయం 8 లక్షలు,ఆ లోపు మాత్రమే ఉండాలి. 2)వ్యవసాయ భూమి 5 ఎకరాలు,ఆ లోపు మాత్రమే ఉండాలి. 3)ఇల్లు 1000 చదరపు అడుగులలో మాత్రమే ఉండాలి. 4)నోటిఫై చేసిన మున్సిపల్ ఏరియాలో స్థలం 100 చదరపు గజాలు మాత్రమే ఉండాలి. 5) రూరల్ ఏరియాలో స్ధలం ఉంటే అది 200 చదరపు గజాలు మాత్రమే ఉండాలి. 4) EWS కి ఎలా అప్లై చేయాలి ? జ) మీ ఆధార్ కార్డును అడ్వకేట్ గారి దగ్గరకు తీసుకువెళ్ళి EWS అప్లై చేయడానికి నోటరీ కావాలని అడగండి.వెంటనే నోటరీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ ఒరిజనల్ నోటరీతో పాటు,అభ్యర్ధి ఆధార్ జెరాక్స్ ,ఓ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని మీ సేవ ఆఫీసు/సచివాలయం కు వెళ్ళండి.అక్కడ వారు ఓ అప్లికేషన్ ఇస్తారు.దానిపై సంతకం చేసేసి మీ దగ్గర ఉన్న పేపర్లు అన్ని ఇస్తే సరిపోతుంది. 5) EWS సర్టిఫికేట్ కాల పరిమితి ఎంత ? జ) EWS సర్టిఫికేట్ కాల పరిమితి ఒక సంవత్సరం (ఏప్రియల్ నుండి మార్చి వరకు)మాత్రమే.టైమ్ అయిపోతే మరల నోటరి దగ్గర నుంచి ప్రాసెస్ మొదలు పెట్టాలి. 2021-22ఫైనాన్షియర్ ఇయర్ లో వచ్చిన ఆదాయం బట్టి ఇచ్చిన సర్టిఫికేట్ కాల పరిమితి 2022 ఏప్రియల్ నుండి 2023మార్చి వరకు మాత్రమే. 6) కుటుంబం అంతటికి ఒక EWS సర్టిఫికేట్ సరిపోతుందా ? జ) సరిపోదు.విద్య,ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుటుంబం లో వారందరూ విడివిడిగా చేయించుకోవాలి.