జిల్లాలో ఈ ఏడాది 2.19 లక్షల మంది రైతులకు రెండోవిడత రైతు భరోసా- పిఎం కిసాన్ నగదు రూ. 90.55 కోట్లు నేరుగా రైతుల ఖాతాలకు ముఖ్యమంత్రి జమ చేసినట్లు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం వైయస్సార్ రైతు భరోసా ఐదో ఏడాది రెండో విడత నిధులను సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయగా, నెల్లూరు కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణమ్మ, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్డ్డ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అతి కీలకమైన పథకం రైతు భరోసా అని, వ్యవసాయ ఖర్చులకు పెట్టుబడి సాయంగా రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం రైతు భరోసా- పిఎం కిసాన్ నగదు అందజేస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1474 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద అందజేసినట్లు చెప్పారు. జిల్లాకు చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయడం మనకు ఎంతో గర్వకారణం అన్నారు. అన్నదాతకు అన్ని విధాల అండగా ఉంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందన్నారు. ప్రతి అడుగులోనూ రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం - జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి ......... - విత్తనం నాటడం నుంచి ధాన్యం అమ్ముకునే వరకు ప్రతి అడుగులోనూ అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ అని చెబితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పండగలా వ్యవసాయాన్ని మార్చేశారని చెప్పారు. రైతులకు గ్రామస్థాయిలోనే అన్ని సేవలు అందిస్తూ, సాంకేతికంగా వారికి తోడ్పాటునందించేలా రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందన్నారు. వైయస్సార్ జలకళ పథకం ద్వారా ఉచితంగా బోర్లు, మోటారు కనెక్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు. ఉచిత పంటల బీమా ద్వారా రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించి రైతుకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. పగటిపూట 9 గంటల వరకు కరెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగా రైతుల ఖాతాలకు జమ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి - కలెక్టర్ హరి నారాయణన్ ..................... వ్యవసాయ సీజన్ కు ముందుగానే రైతులకు పెట్టుబడి సాయంగా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా నేరుగా వారి ఖాతాలకు ప్రభుత్వం నగదును జమ చేస్తుందని, వ్యవసాయానికి మేలు జరిగేలా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పథకాన్ని అందజేస్తున్నామని, ఏదైనా సమస్యతో నిధులు జమ కాని వారు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం జిల్లాలో రైతులకు సంబంధించిన రైతు భరోసా నమూనా చెక్కులను రైతులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. రైతుల అభిప్రాయాలు ......................... 1). రైతుకు ఇంత పెద్దఎత్తున ఎవరూ సాయం చేయలేదు - బిక్కె వెంకటాద్రి, రాపూరు మా గ్రామంలో నేను ఐదు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాము. రెండు ఎకరాలు మునగ, మూడు ఎకరాలు వరి సాగు చేస్తున్నాము. నాకు క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి, రైతు గతంలో లాగా ఎవరి చుట్టూ తిరగకుండా నేరుగా సేవలు అందుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా చాలామంది ముఖ్యమంత్రులను చూసాము కానీ జగన్ లాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు. రైతులకు జగన్ లాగా ఎవరూ చెయ్యలేదు.. చెయ్యలేరు కూడా. 2). చెప్పినవన్నీ చేస్తున్నాడు - సుధాకర్ రెడ్డి, చిన్న చెరుకూరు - ముఖ్యమంత్రులు ఏదో చెప్తారు కానీ.. పూర్తిగా చేయలేరు. కానీ ఒక్క జగన్ మాత్రమే చెప్పిన ప్రతి ఒక్క మాట తప్పకుండా చేస్తున్నాడు. ముసలోళ్లకు, పిల్లలకు, ఆడోళ్లకు, నాలాంటి పేద రైతులకు అన్నీ చేస్తున్నాడు. నాలాంటి పేద రైతుకు రైతు భరోసా ఎంతో ఉపయోగపడుతుంది. మా గ్రామంలోని రైతు భరోసా కేంద్రం ఎంతో ఉపయోగపడుతుంది. అక్కడ పనిచేసే శివకుమార్ నెలకు నాలుగైదు సార్లు వచ్చి మాకు సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నాడు. ధాన్యం ఉత్పత్తి కూడా ఎక్కువగా వచ్చి ఈ ఏడాది మంచి ధర పొందాను. రైతుల గురించి ఇంతలా ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. ........................ DIPRO, NELLORE