ప్రయోక్త :- నెల్లూరు జిల్లాలో గురుకుల పాఠశాల
యూనిఫారం కుట్టినందుకు 2019,2020,2021
కూలి డబ్బులు అందలేదని,2020 లో మాస్క్ లు
కుట్టినందుకు కలిపి మొత్తం ప్రభుత్వం నుండి 61 లక్షలు రావలసి ఉంది అని మెప్మా టైలర్స్ అసోషియేషన్ వారు, ప్యూపిల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు
ఆవేదన వ్యక్త పరిచారు.5000 మంది పొదుపు గ్రూప్
మహిళా టైలర్ లు కేవలం 3 రూపాయల కే మాస్క్ లను
కుట్టి ఇవ్వడం జరిగింది. ఆ కూలి డబ్బులు కూడా
సకాలంలో ఇవ్వక పోవడంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాం అని తెలిపారు. జిల్లా అధికారులు
సహకరించి నిధుల విడుదల కు చర్యలు తీసుకోవాలి
అని నెల్లూరు ప్రెస్ క్లబ్ ద్వారా డిమాండ్ చేయడం
జరిగింది.
0 కామెంట్‌లు