ప్రయోక్త :- నెల్లూరు పట్టణంలోని
శ్రీ వాసవీ కన్యకాపారమేశ్వరిఅమ్మవారి దేవస్థానం అభివృద్ధి కోసం ఎంతో మంది దాతలు
విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆర్యవైశ్య కులం మీద
అభిమానంతో, నమ్మకంతో ప్రభుత్వం కూడా పాలనా
వ్యవహారాలు ఆర్యవైశ్య కులం వారికే ఇవ్వడం జరిగింది.
కోట్ల విలువ చేసే మాగాణి పొలం,కోట్ల విలువ చేసే బంగారం,
వెండి,కోట్ల రూపాయల నగదు అమ్మవారి సన్నిధిలో ఉన్నాయి.
అలాగే దేవస్థానం ఆవరణలో ఉండే దుకాణాలు కూడా
అనేకం ఉన్నాయి.వీటి బాడుగలు ప్రస్తుతం ఉండే
రేట్స్ ప్రకారం ఇస్తే కోట్ల రూపాయలు వస్తాయి.కానీ
పాలక వర్గం ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదనేది
సమాచారం.
ప్రస్తుతం ఆ దుకాణాలు
ఎవరి పేరుతో ఐతే ఇచ్చినట్లు
రికార్డుల లో ఉన్నాయో వారిలో
అత్యధిక శాతం
వ్యాపారం చేయడం లేదు.
కనీసం వారి వారసులు
కూడా అందులో లేరు.
దేవాలయం రికార్డుల లో ఉన్న వ్యక్తుల
పేరుతో GST కూడా లేదు,లేబర్ సర్టిఫికెట్ లేదు,
కనీసం ప్రొఫెషనల్ టాక్స్ కూడా లేదు. అలాంటప్పుడు
ఆ దుకాణాల ను స్వాధీనం చేసుకుని అధిక బాడుగలకు
ఇవ్వవచ్చు కదా అనేది సామాన్య ప్రజల అభిప్రాయం.
ఈ విధంగా నగరం లోని సర్వోదయా కాలేజీ,
ఇతర ఎండోమెంట్ ఆస్తులు ,నగరపాలక సంస్థ ఆస్తులు
కూడా ఉన్నాయి.
0 కామెంట్‌లు