అనవసరంగా బయట తిరిగితే చర్యలు తప్పవు::

ఆర్.డి.ఓ హుస్సేన్ సాహెబ్

డి.ఎస్.పి... శ్రీనివాసులు రెడ్డి


   ప్రయోక్త :-     కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇవ్వడం జరుగుతోందని నెల్లూరు ఆర్.డి.ఓ.హుసేన్ సాహెబ్,డి.ఎస్.పి.శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు.మంగళవారం నగరములోని ఆర్.డి.ఓ.కార్యాలయములో నిర్వహించిన విలేఖరుల సమావేశములో వారు మాట్లాడుతూ ఉదయం.6 గంటల నుంచి మ.12 వరకే షాపులకు అనుమతి, 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు ప్రైవేటు వాహనాలు రాకపోకలపై నిషేధం, అంతరాష్ట్ర సర్వీసులు కూడా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు అందరూ సహకరించాలని, అనవసరంగా బయటకు తిరిగే వారి మీద కోవిడ్ కేసులు నమోదు చేసి  రిమాండ్ కు తరలించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఒక నెలకు సరిపడా సామాన్లు, ఆరోగ్యం బాగా లేని వారు మందులు తీసి పెట్టుకోవాలని సూచించారు.అనేక మంది అనవసరంగా బయట  తిరుగుతున్నారని అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.అత్యవసర వేళల్లో బయటకు వచ్చే పనైతే, మాస్కులు ధరించి,  భౌతిక దూరం పాటించాలని,ఇప్పటికే కరోనా వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ,ఆరోగ్యంగా జీవించాలని కోరారు.