ప్రయోక్త :-     నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ నందు బుధవారం ఉదయం రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి  మేకపాటి గౌతంరెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి శ్రీ పోలుబోయిన అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్.చక్రధర్ బాబు కోవిడ్ మేనేజ్ మెంట్, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్షా, సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి  మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ.., మొదటి వేవ్ లోని కోవిడ్ వ్యాధి లక్షణాలకు, మరణాలకు.., రెండో వేవ్ లో నమోదవుతున్న వ్యాధి లక్షణాలు, మరణాలకు ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు.  జిల్లాలో ఎన్ని నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రులు ఉన్నాయి..? నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రుల్లో ఎన్ని ఆక్సిజన్..? ఎన్ని ఐ.సి.యు..? బెడ్స్ అందుబాటులో ఉన్నాయి..? అనే వివరాలు జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్.చక్రధర్ బాబు, టాస్క్ ఫోర్సు అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. రోగులకు అందించడానికి ప్రతిరోజూ ఎన్ని మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోంది..? ప్రస్తుతం ఎంత ఆక్సిజన్ జిల్లాకు సరఫరా అవుతోంది.. ? అనే వివరాలు అడిగి తెలుసుకున్న పరిశ్రమల శాఖామంత్రి.., కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలతో మాట్లాడి ఆ కొరతను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి ఒకేచోట బెడ్స్ ఎక్కువ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు తెలిపారు. ప్రతిరోజూ ఎన్ని మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉందా..? అనేది ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలన్నారు. ఆక్సిజన్ కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ మాట్లాడుతూ.., నెల్లూరు జి.జి.హెచ్ ఆస్పత్రిలో ఐ.సి.యు రూం నందు పనిచేస్తున్న జూనియర్ వైద్యులకు అధిక పనిగంటలు సమయం కేటాయిస్తున్నారని.., దానివలన వారు విధులు నిర్వర్తించలేకపోతున్నారన్నారు. ఐ.సి.యు లో పనిచేసే వారికి రోజుకి 8 గం. చొప్పున షిప్టు విధానంలో డ్యూటీలు కేటాయించాలన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు బెడ్స్ కేటాయించడంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, జిల్లా కలెక్టర్ దృష్టికి మంత్రి తీసుకువచ్చారు. అలాంటి ఘటనలు ఏమైనా జరిగితే తప్పక చర్యలు తీసుకుంటామని మంత్రికి తెలిపిన కలెక్టర్.., నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నోడల్ అధికారులు వారికి కేటాయించిన ఆస్పత్రిలో పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేదలు ఆస్పత్రికి వచ్చినప్పుడు వెంటనే వారికి తగిన చికిత్స అందించాలని, ఆక్సిజన్ అందించడంలో ఆలస్యం చేసినా..? రెమిడిస్ వేర్ వంటి మందులు అందించడం ఆలస్యం అయినా..? రోగి పరిస్థితి విషమిస్తోందని.., ఈ లోటుపాట్లు లేకుండా జిల్లాలో కోవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. నిబంధనలు ఉల్లఘించి జి.జి.హెచ్. లో బెడ్స్ కేటాయింపులు జరిగాయనే విషయాన్ని తెలిపిన మంత్రి, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జి.జి.హెచ్.సూపరింటెండ్ ని ఆదేశించారు. దీనిపై స్పందించిన కలెక్టర్  కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., ఎస్పీకి ఫిర్యాదు చేయాలని జి.జి.హెచ్. సూపరింటెండెంట్ ని ఆదేశించారు.  

ఈ సమావేశం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ.., జిల్లాలోని 38 కోవిడ్ నోటిఫైడ్ ఆస్పత్రులకు 332 ఐ.సి.యూ బెడ్స్, 1343 ఆక్సిజన్ బెడ్స్, 1076 నాన్ ఆక్సిజన్ బెడ్స్ లో చికిత్స అందించడానికి అనుమతి ఇచ్చామన్నారు. ఇప్పటికే జి.జి.హెచ్..., నారాణయ, కిమ్స్, అపోలో ఆస్పత్రితో పాటు.., నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రుల్లోని రోగులకు చికిత్స అందించడానికి ప్రతిరోజూ.., 36.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగిస్తున్నామన్నారు. తమిళనాడు నుంచి సరఫరా అవ్వాల్సిన ఆక్సిజన్ సమయానికి అందకపోవడం వలన.., కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని.., కర్ణాటక, వైజాగ్, ఇస్రో నుంచి ఆక్సిజన్ అత్యవసరంగా తీసుకుని వచ్చి.., రోగులకు ఆక్సిజన్ అందించామని మంత్రికి తెలిపారు.  సమీక్షా, సమావేశంలో ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్  హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్  దినేష్ కుమార్, గూడూరు సబ్ కలెక్టర్  ఆర్. గోపాల కృష్ణ, నోడల్ అధికారులు, టాస్క్ ఫోర్సు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది హాజరయ్యారు.