ప్రయోక్త :-     నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్ర ఎనర్జీ శాఖామంత్రి

 బాలినేని శ్రీనివాస రెడ్డి.., రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి  మేకపాటి గౌతంరెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి   పోలుబోయిన అనిల్ కమార్, జిల్లా కలెక్టర్    కె.వి.ఎన్.చక్రధర్ బాబుతో కలిసి కోవిడ్ నివారణ చర్యలపై సమీక్షా, సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో రాష్ట్ర ఎనర్జీ శాఖామంత్రి     బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి వలన అన్ని రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని... ఇలాంటి క్లిష్టపరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి   వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజూ మంత్రులు, అధికారులతో కోవిడ్ నివారణ చర్యలను పర్యవేక్షిస్తూ.., ఆక్సిజన్ కొరత ఏర్పడినా..? మందుల కొరత ఏర్పడినా..?ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానితో సంప్రదించి.., ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం.., జిల్లాలో ఇప్పటి వరకూ కోవిడ్ నివారణకు తీసుకున్న చర్యలు.., టెస్టింగ్ స్ట్రాటజీ, నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్ వివరాలు.., హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి అందిస్తున్న కిట్స్ వివరాలు, ఆక్సిజన్ మేనేజ్ మెంట్, 104 కాల్ సెంటర్ ద్వారా కోవిడ్ రోగులకు అందుతున్న సేవలపై జిల్లా కలెక్టర్, కోవిడ్ టాస్క్ ఫోర్సు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండో వేవ్ లో ఆక్సిజన్ శాచురేషన్ లెవల్స్ త్వరగా తగ్గిపోయి.., కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్యం దెబ్బతింటోందని.., ఆస్పత్రులకు వచ్చిన వారిలో అధికశాతం మందికి ఆక్సిజన్ బెడ్స్ అవసరం అవుతున్నాయని మంత్రి తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి, కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసి.., మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ కి సూచించారు. 104, 108 అంబులెన్సులు వినియోగించుకుని రోగులను ఆస్పత్రికి తరలించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్స్ తప్పని సరిగా ఆరోగ్య శ్రీ ద్వారా కోవిడ్ రోగులకు కేటాయించాలని, ఏ ఆస్పత్రి యాజమాన్యం ఈ నిబంధనను ఉల్లంఘించినా.., నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 


ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి       మేకపాటి గౌతం రెడ్డి మాట్లాడుతూ.., ఆక్సిజన్ కొరత లేకుండా పరిశ్రమల శాఖద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని.., ఎక్కడ ఆక్సిజన్ కొరత ఏర్పడినా, వెంటనే ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి మరీ జిల్లాలోని ఆస్పత్రులకు ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు. క్రృష్ణతేజ ఎయిర్ ప్రాజెక్టులో ఎయిర్ సెపరేషన్ యూనిట్ ని ఏర్పాటు చేశామని, ఈ ప్లాంట్ నుంచి 4 కె.ఎల్. ఆక్సిజన్ లభిస్తోందన్నారు. 


ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్      కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ.., రాష్ట్ర మంత్రులు        మేకపాటి గౌతంరెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ గారి సహకారంతో డిస్ట్రిక్ టాస్క్ పోర్సు కమిటీ.., జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ మొదటి, రెండో వేవ్ లో తీసుకున్న కోవిడ్ నివారణ చర్యలు, కోవిడ్ పాజిటివిటీ రేటు, ఆక్టివ్ కేసులు, ఇప్పటి వరకూ జరిగిన మరణాల వివరాలు రాష్ట్ర ఎనర్జీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి.., జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 18,000 కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయని.., వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రతిరోజూ 7000 పైగా టెస్టులు నిర్వహిస్తూ.., 24 గంటల్లో ఫలితాలు అందిస్తున్నామన్నారు. రెండో వేవ్ లో ఆక్సిజన్ శాచురేషన్ లెవల్స్ త్వరగా తగ్గుతున్నాయని, కేసులు కూడా త్వరగా పెరుగుతున్నాయని, అందువల్ల జిల్లాలో ఐ.సి.యు, వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్స్ కేటాయించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. జిల్లాలో 37 ఆస్పత్రుల ద్వారా కోవిడ్ చికిత్స అందిస్తున్నామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో మొత్తం 3790 బెడ్స్ ఏర్పాటు చేశామని, 1119 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారికి యోగా, గేమ్స్ ఆడుకునే సదుపాయం కల్పించి.., వారు త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీహరికోటలో ఇండస్ట్రీస్ వారు కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారని, ప్రభుత్వం తరఫు నుంచి వైద్యులు, సిబ్బందిని, మెడిసిన్స్ ని వారికి అందించామన్నారు. హోం ఐసోలేషన్ ఉన్నవారికి కిట్ అందిస్తున్నామని, వైద్యులు, సిబ్బంది ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారన్నారు. ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని.., అనుమానిత కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ వస్తే వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించడం.., హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి కిట్స్ అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఆక్సిజన్ మానటరింగ్ సెల్ ఏర్పాటు చేశామని, రాష్ట్ర అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ.., ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్ ను ఎప్పటికప్పుడు అందిస్తున్నామన్నారు. కృష్ణతేజ ఎయిర్ ప్రొడక్టు నుంచి ఎయిర్ సపరేషన్ ద్వారా 2 రోజుల నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి.., కృష్ణపట్నం పోర్టు, నేవీ  ద్వారా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం రోజుకు 200 ఆక్సిజన్ సిలండర్లు ఉత్పత్తి అవుతున్నాయని, త్వరలోనే ఈ ప్లాంటు నుంచి 440 ఆక్సిజన్ సిలిండర్లు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుని.., ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేస్తామన్నారు. 104 కాల్ సెంటర్ ద్వారా 24 గం. కోవిడ్ రోగులకు అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో రెమిడిస్ వేర్, ఇతర మెడిసిన్స్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రెమిడిస్ వేర్, స్టెరాయిడ్స్ ఇచ్చినా కోవిడ్ నుంచి కోలుకోని 31 క్రిటికల్ కేసులకు.., కమిటీ రికమెండేషన్స్ తో టోసిలిజుమాబ్ ఇంజక్షన్స్ ఇచ్చామని.., అందరూ కోలుకున్నారన్నారు. 


ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే     కె.శ్రీధర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే      రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే      వి.వరప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే    కిలివేటి సంజీవయ్య, ఎస్పీ    భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ)   హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి)          జి.గణేష్ కుమార్, నోడల్ అధికారులు, టాస్క్ ఫోర్సు అధికారులు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.