ప్రయోక్త:- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జగనన్న శాశ్వత

భూ హక్కు పధకం క్రింద భూముల

రీ సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా ,త్వరితగతిన, పూర్తి

చేయాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్

చక్రధర్ బాబు సర్వేయర్లను ఆదేశించారు.

   మే 24 న   జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టరు  చక్రధర్

బాబు, భూముల రీ సర్వే కార్యక్రమంలో భాగంగా సర్వేయర్లకు లాప్ టాప్ లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో జరుగుచున్న జగనన్న శాశ్వత భూ హక్కు

పథకం క్రింద భూముల రీ సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేసేందుకు

సర్వేయర్లకు ఆధునిక టెక్నలిజీలో శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన లాప్ టాప్ తదితర

ఎక్యుప్ మెంట్ ను అంద చేస్తున్నట్లు తెలిపారు. తొలి విడతగా 46 మండల సర్వేయర్లకు లాప్ టాప్ లను

కేటాయించడమైనదని, 2వ విడతలో మిగిలిన సర్వేయర్లకు లాప్ టాప్ లను అందజేయడం

జరుగుతుందని ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు,

జిల్లా కలెక్టరుకు వివరించారు.

జిల్లాలో ఇప్పటి

వరకు 108 గ్రామాల్లో భూముల రీ సర్వే జరిగిందని సహాయ సంచాలకులు  హనుమాన్ ప్రసాద్ ,

జిల్లా కలెక్టరుకు వివరించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు డా. హరేంధిర ప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్

సహాయ సంచాలకులు  హనుమాన్ ప్రసాద్, సర్వేయర్లు పాల్గొన్నారు.