వీరమాచనేని ఏమన్నారంటే.....
ప్రయోక్త :- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,
నెల్లూరు పట్టణంలో ఆగస్ట్ 15 న టౌన్ హల్ లో
కరోనా ను తరిమి కొడుదాం,జీవించే హక్కు కోసం
పోరాడుదాం , కార్పొరేట్ మెడికల్ మాఫియాను తరమాలి
అని ప్రజా పార్లమెంట్ ను నిర్వహించారు.
ఈ సభ ను పౌర హక్కుల సంఘం నెల్లూరు జిల్లా వారు ఏర్పాటు చేశారు.భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సభకు వచ్చిన ప్రజలు కరోనా పై వారి అభిప్రాయాలను, అనుభవాల ను చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా వీరమాచనేని .రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో దోచుకునే స్వభావం పెరిగి పోయింది. ఈ శతాబ్దంలో అతి పెద్ద మోసం మెడికల్ మాఫియా.మీరు మొదట ఆలోపతి మందులు పారేసి డైట్ పాటిస్తే ఆహారం ద్వారా నే షుగర్ తగ్గుతుంది అని తెలిపారు. అమెరికన్ ప్రేరేపిత ముఠా వలనే షుగర్ వ్యాధి గ్రస్థులు పెరిగిపోతున్నారు అని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లో ఎక్కువ మంది చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మెడికల్ మాఫియా నన్ను గుర్తించడం లేదు.అలాంటిది చైనా గుర్తింపు ఇవ్వడం జరిగింది. జనవిజ్ఞాన సంస్థ వారు నన్ను విమర్శించడం అనేది అర్ధం కావడం లేదని అన్నారు. నెయ్యి కి కొవ్వు పట్టడానికి సంబంధం లేదని తెలిపారు. నూనె ల లో కల్తీ వున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.ఆహార పదార్థాల కల్తీ వలనే మనకు రోగాలు వస్తున్నాయని ప్రజలు నిద్ర లేవాలి అని సూచించారు. మందుల కారణంగానే కిడ్నీలు పాడైపోతున్నాయి. ఒక దానికి మందు వేస్తే ఇంకొక జబ్బులు వస్తున్నాయి. అందుకే పోషకాహారం తీసుకోవాలని అన్నారు.
భారత ప్రభుత్వం అనుమతులు,icmr అనుమతులు ఇవ్వడంలో జాప్యం. WHO రేమిడిసివర్ వద్దంటే అమలు జరమడం ఏమిటో అర్థం కావడం లేదు.కోవిడ్ కు అమ్మే ప్రతి మందు మీద GST నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మన దేశం లో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేయాలి.అప్పుడు ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రతి ఉక్కు ఫ్యాక్టరీ ఆక్సిజన్ ను సరఫరా చేయాలి. ప్రజలు జీవనోపాధి ని పోగొట్టుకున్నారు.వారికి ప్రభుత్వం సహాయం చేయాలి అని డిమాండ్ చేశారు. కరోనా కు భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.
మనిషి ఆహారం రెండు సార్లు కంటే తింటే మంచిది. లేదా ఆకలి వేసినప్పుడే తినండి అని అన్నారు. మనదేశానికి చైనా చాలా తక్కువ రేట్ కే అనేక వస్తువులు అందిస్తుంది.అదే అమెరికా అయితే ఎక్కువ రేట్ కు మనకు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ఎటువంటి మొండి వ్యాధుల కయినా సలహాలు చెప్పడం జరుగుతుంది అని వీరమాచనేని వాట్సాప్ నెంబర్ ను ప్రజలకు ఇవ్వడం జరిగింది.
9246472677 ఈ నెంబర్ కు వాట్సప్ చేయాలని కోరారు.
0 కామెంట్‌లు