ప్రయోక్త :-కంటేపల్లి గ్రామంలో గ్రావెల్ తవ్విన ప్రాంతాన్ని పరిశీలించిన ప్రజా సంఘాల నాయకులు:
గత పది రోజులు గా కంటేపల్లి గ్రామపరిదిలో అక్రమంగా తవ్విన గ్రావెల్ తవ్వకం జరిగిన ప్రదేశాన్ని ప్రజా సంఘాల ఆద్వర్యంలో పర్యటించి అక్కడ జరిగిన నిజ నిజాల్ని తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్బంగా ప్రజా సంఘాల నాయకులు పి.టోని బాబు మట్లాడుతుా పది ఎకరాల్లో గ్రావెల్ త్రవ్వటం నేపద్యంలో మేము నిజా , నిజాలను తెలుసుకోవదానికి రావడం జరిగిందని అయితే రైతులు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.నిజంగా అక్కడ అక్రమ మైనింగ్ జరగకుండా ఉంటే సమస్యను పరిష్కరించల్సిన వారు ఎందుకు స్దబ్దత గా ఉన్నారో అర్దం కావడం లేదని అన్నారు.ఇప్పటికైనా అక్కడ అక్రమంగా గ్రావెల్ తరలించార లేదా అనే విషయాన్ని అధికారులు తేల్సాలని నిజ నిజాలు జిల్లా ప్రజలకు తెలిజేయాల్సిన అవసరం ఉందని అధికారులకు తేలియజేశారు.లేని పక్షంలో మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.పై కార్యక్రమంలో నాయకులు పి.ఆదిత్య సాయి, పి.లీలా మెాహన్,అద్దంకి.జగన్,శ్యామ్,శ్రీకాంత్,మధు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు