ప్రయోక్త :- ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి,6 అడుగుల దూరం పాటించాలి, చేతులు శుభ్రం చేసుకోవాలి, మాస్క్ లేనిదే దుకాణాలలోకి రానివ్వద్దు అని విజ్ఞప్తి చేస్తున్నామని నెల్లూరు జాయింట్ కలెక్టర్ ప్రెస్ మీట్ ద్వారా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలిపారు. ఈ రోజు నుండి జిల్లాలో 15 రోజులు ఖచ్చితంగా కరోనా జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రభుత్వం నుండి ప్రచారం చేస్తున్నాం అని తెలిపారు. అలాగే వాక్సిన్ అందుబాటులో ఉంది.గ్రామస్థాయిలో నే వాక్సిన్ అందుబాటులో ఉంది.ఉచితంగా రేపటి నుండి గ్రామాల్లో వాక్సిన్ వేస్తారు.45 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు.ఒకసారి వాక్సిన్ వేసుకున్న తరువాత రెండో డోస్ కూడా వేసుకోవాలని కోరారు. జిల్లాలో ఇప్పటికే లక్ష మందికి వాక్సిన్ వేసివున్నాం. వివిధ వయస్సుల వారు వాక్సిన్ వేసుకుని వున్నారు. మరలా కోవిడ్ కేస్ లు జిల్లాలో పెరిగాయి.6 కేస్ ల నుండి 20 కేస్ లకు పెరిగాయి.బయట ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి కరోనా కేస్ లు వస్తున్నాయి. కేంద్రప్రభుత్వం కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.
0 కామెంట్‌లు