ప్రయోక్త;- 3 వేవ్ ను ఎదుర్కోవడానికి వచ్చిన అధికారులందరికి ధన్యవాదాలు మంత్రి అనీల్ తెలిపారు.

అలాగే కరోనా 2 ను సమర్థవంతంగా నెల్లూరు జిల్లా
అధికారులు ఎదుర్కొంనందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కరోనాను ఎదుర్కోవడం లో టాప్ 5 లో మనం ఉండడం
గొప్ప విషయం.3 వేవ్ వస్తుందా రాదా అని కాకుండా జాగ్రత్తగా ఉండాలి.పిల్లల పై ప్రభావం చూపిస్తే తల్లిదండ్రులు
పడే బాధ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం వైపు ఎటువంటి
లోపం ఉండకూడదు.కరోనా 2 లో ఆక్సిజన్ సమయానికి
అందించడంలో ఇబ్బంది పడడం జరిగింది. ఈ సారి
అలా ఉండకూడదు. నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ లో
900 మందికి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడ సిబ్బంది ని కూడా కోల్పోయాం.అని
ఇరిగేషన్ మంత్రి అనీల్ తెలపడం జరిగింది.
చిన్నపిల్లల డాక్టర్ల ను రెడీ గా ఉంచవలసిన అవసరం
ఉంది.
ఆక్సిజన్ చెన్నై నుండి మనకు అందుబాటులో ఉంది
ఆ ఏర్పాట్లు చేసుకోవాలని అభిప్రాయం గా తెలిపారు.
ఇప్పటికే ప్రపంచంలో 25 వేల మంది కి పైగా    పిల్లలు   కరోనా బారీన
పడ్డారు.అందువలన 3 వేవ్ వస్తుందని అనుకోవలసి
వస్తుంది అని తెలిపారు.గతంలో కరోనా వ్యాపి జరిగాక
15 రోజుల తరువాత రోగికి ఇబ్బంది వచ్చేది.ఇప్పుడు
వారానికి ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు.
కాబట్టి తక్కువ సమయం ఉంటుంది కాబట్టి
అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు.
శానిటరీ సిబ్బంది విషయంలో ఎక్కువ పొరపాట్లు
జరుతున్నాయి.లక్షల్లో అవినీతి జరుగుతున్న
విషయం తెలిసింది ఆ విషయం లో జాగ్రత్తగా
ఉండాలి అని తెలిపారు.
ఈ సారి కరోనా 3 సమయానికి రోడ్ పక్కన వ్యాపారం లో
ఉండే అందరికి వాక్సిన్ అందించాలి అని అన్నారు.
ప్రయివేటు హాస్పిటల్స్ లో మంచి సాఫ్ట్వేర్ ను
అతి చిన్న ఉద్యోగుల నిర్వహిస్తున్నారు.అలాంటిది
ప్రభుత్వ హాస్పిటల్ లో సాఫ్ట్వేర్ ఎందుకు ఉపయోగించరో
అర్ధం కావడం లేదు.అని అధికారుల ను ఉద్దేశించి
అన్నారు.15 రోజులలో సాఫ్ట్వేర్ అందుబాటులో కి
తెస్తాం అని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం జూన్ 14 న  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న తిక్కన
భవనం లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,
ఇతర ఉన్నత అధికారులు,అధికారులు పాల్గొన్నారు.