ప్రయోక్త :- ఏదయినా సమస్య వచ్చినప్పుడు దాని వెనకే

ప్రజలను రక్షించడానికి తగిన ప్రయత్నాలు కూడా ముమ్మరంగానే

జరుగుతూ ఉంటాయి.తాజాగా ఖరగ్ పూర్ ఐ ఐ టి

పూర్వ విద్యార్థి కలకత్తా ఐ ఐ ఎమ్ కు చెందిన పీయూష్

అగర్వాల్ బ్యాటరీతో నడిచే మాస్క్ తయారు చేసాడు.

ఈ మాస్క్ కరోనా వైరస్ నుంచి రక్షణ కలిగించడమే

కాకుండా కాలుష్యం బారీ నుండి కూడా మనల్ని

కాపాడుతుంది.

దీనిని  ధరించే వ్యక్తికి తగినంత ఆక్సిజన్ అందేలా

ఈ మాస్క్ లో బ్యాటరీ తో నడిచే రెండు ఫ్యాన్ లు

అమర్చారు.ఇది ఈ మాస్క్ ప్రత్యేకత.

ఈ బ్యాటరీ షుమారు 8 గంటల వరకు పనిచేస్తుంది.

వీటిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కవచ్ మాస్క్ ప్రాజెక్ట్

కింద అభివృద్ధి చేశారు.ఈ మాస్క్ ధర 3000/- రూపాయలు.

దీనిలో రెండు ఫ్యాన్లు ఉంటాయి.ఒక ఫ్యాన్ ఆక్సిజన్

సరఫరా చేస్తే మరొకటి కార్బన్ డై ఆక్సైడ్ ను,తేమను

బయటకు పంపి వేయడానికి ఉపయోగపడతాయని

పీయూష్ చెబుతున్నారు. అంటే దీనిని ఉపయోగించి

వారికి నిరంతరం స్వచ్చమైన గాలి అందుతూ ఉంటుందన్నమాట. దీనికి బ్రాన్డ్ మోక్షా అని పేరు పెట్టారు.

ఈ మాస్క్ ప్రత్యేకంగా ఆరోగ్య సిబ్బంది,పారిశుద్ధ్య

కార్మికులు ఇతరుల కోసం తయారు చేశారు.వీటి వల్ల

కార్మికులకు ఉపాధి లభించడం తో పాటు వారు కొత్త

టెక్నీక్స్ నేర్చుకునే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ

అభిప్రాయం. ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్న

క్రీడాకారులు ఈ మాస్క్ లను ఉపయోగించేందుకు ఆసక్తి

చూపిస్తున్నారు.