ప్రయోక్త :- 1998 DSC వారికి

అప్పటి ముఖ్యమంత్రి తీవ్ర

అన్యాయం చేసారు.అప్పటి నుండి

వాళ్ళు కనపడిన ప్రతి అధికారికి

వినతి పత్రం ఇస్తూ వస్తున్నారు.


ప్రతి ముఖ్యమంత్రి కి వినతి పత్రం

ఇచ్చారు.చివరికి జగన్ వారి

బాధను అర్ధం చేసుకుని పాదయాత్రలో హామీ ఇచ్చారు.


తక్కువ మార్కులు వచ్చిన వారికి

ఉద్యోగం,ఎక్కువ మార్కులు

వచ్చిన వారికి నిరుద్యోగం

మిగిలింది.


వీరికి ఏ విధంగా చూసినా ఉద్యోగం

రావాలి.కానీ ఇప్పటికీ వీళ్ళను

పట్టించుకునే నాధుడే లేదు.


ఇప్పటికే ఆ అభ్యర్థుల వయస్సు

50 సంవత్సరాలు దాటింది.

ఐనప్పటికీ ఒక్కరోజు అయినా

ప్రభుత్వ ఉద్యోగం చేయాలి

అనే పట్టుదలతో

ఏ మాత్రం నీరసం పడకుండా

వీళ్ళు పోరాటం చేస్తున్నారు.

స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు

చేస్తే వెంటనే పరిస్కారం అని

1902 కు కూడా ఫిర్యాదు

చేశారు.

చివరికి 2008 DSC లో కూడా పొరపాట్లు జరిగాయి.

వారికి

ఉద్యోగాలు ఇస్తూ 1998

వారికి ఇవ్వక పోయే సరికి

మరలా ఉద్యమమం చేయాలని

నిర్ణయించుకున్నారు.

వీళ్ళు గతం లో నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది.

2002 DSC లో కూడా అనేక

అవకతవకలు జరిగాయి.

1998,2002,2018 వారికి

ఉద్యోగాలు ఇవ్వాలని ప్రస్తుతం

డిమాండ్ ఉంది.