ప్రయోక్త :-    శ్రీ పొట్టి శ్రీరాములు   నెల్లూరు జిల్లా  లోsc, st అట్రాసిటీ మీటింగ్

ప్రతి 3 నెలలకు ఒక సారి మీటింగ్ జరగడం దీని ద్వారా

అనేక విషయాలు చర్చించుకోవడం అనేది బాగుంది.

ప్రతి 3 నెలలకు కేస్ లు పెరుగుతున్నాయా లేక

తగ్గుతున్నాయా అనేది పరిశీలించాలి అని జిల్లా కలెక్టర్

తెలిపారు.  ఈ కార్యక్రమం    కలెక్టర్ కార్యాలయం లోని తిక్కన     భవనం లో జులై 2 న జరిగింది.      కేస్ లు రిపీట్ అవుతుంటే కఠినంగా చర్యలు

తీసుకోవాలని కోరారు.ఏ ప్రాంతంలో ఎక్కువ కేస్ లు

వస్తున్నాయి,ఎందుకు వస్తున్నాయి అనే విషయాలపై

ప్రత్యేక దృష్టి పెట్టాలి అని తెలిపారు.

కేస్ వచ్చిన 24 గంటలలో రసీదు ఇచ్చి fir నమోదు

చేయాలి అని అన్నారు.గ్రామంలో నే మహిళా పోలీస్

వున్నారు కాబట్టి అక్కడే సచివాలయంలో నే fir

నమోదు చేయమని ముఖ్యమంత్రి తెలిపి వున్నారు.

ఆ విధంగా వారికి శిక్షణ కూడా ఇవ్వడం. జరిగింది

అని అన్నారు.

ప్రతి గ్రామంలో ప్రభుత్వ సేవలు అందుబాటులోకి

వచ్చాయి అనే విషయం ప్రజలు భావించే విధంగా

అధికారులు పనిచేయాలి అని తెలిపారు.

ఇకనుండి sc, st, కాలనీ లకు గొప్ప వారి పేర్లు

పెట్టుకునే విధంగా 2500     కాలనీ ల    నుండి 

వినతులు అందాయి ఈ విషయాన్ని ప్రభుత్వానికి

వెంటనే నివేదిక పంపుతాను అని సబ్యులకు,

కమిటీకి,సోషల్ వెల్ఫేర్ అధికారుల కు

ప్రజలకు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

కాలనీల కు బోర్డ్ లు ఏర్పాటు చేయాలని

ఒకరు కోరారు.

Fir లో పేర్లు మారుతున్నాయి అనే దానికి

పోలీస్ అధికారి వివరణ ఇస్తూ అవసరమైన

సందర్భంలో మార్చడం జరుగుతుంది అని

తెలిపారు.

10 సంవత్సరాలు గా కేస్ లు పరిష్కారం కావడం

లేదని ఒకరు కోరారు.

సజ్జాపురం కేస్ లో రావాల్సిన నిధులు రాలేదని

తెలపగా వెంటనే పరిశీలించి న్యాయం చేస్తామని

జాయింట్ కలెక్టర్ తెలిపారు.

గూడూరు లో గుడి కోసం స్థలం కావాలని ఒకరు

కోరగా పరిశీలిస్తామని అన్నారు.

మన్నార్ పోలూర్ అనే గ్రామంలో ఒక షాప్

ను తొలగించారు..దీనికి సంబంధించి ఇప్పటి వరకు

ఏమైనదో అనేది అర్ధం కావడం లేదని ఒకరు

చెప్పారు.ఈ విషయం పై సూళ్లూరుపేట పోలీసు

స్టేషన్ లో కేస్ పెట్టినప్పటి తీసుకోలేదని కలెక్టర్

దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.


ఈ    కార్యక్రమంలో     గూడూరు ఎం.ఎల్.ఏ

జిల్లా స్థాయి అధికారులు,ఇతర సిబ్బంది,పోలీసు

అధికారులు,అట్రాసిటీ కమిటీ బాద్యులు

పాల్గొన్నారు.