భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి విపత్తు నిర్వహణకు టోల్ ఫ్రీ నెంబర్ కమిషనర్ శ్రీమతి హరిత నెల్లూరు వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏలాంటి విపత్కర పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు నగర పాలక సంస్థ సిద్ధంగా ఉందని కమిషనర్ శ్రీమతి హరిత తెలిపారు. భారీ వర్షాలకు నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రధాన డ్రైను మార్గాలు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలు, అండర్ బ్రిడ్జ్ ల పరిస్థితిని అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాల నేపధ్యంలో కార్పొరేషన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నామని తెలిపారు. వర్షాల నేపధ్యంలో సమస్యలు కలిగినవారు 18004251113,0861 230 1541 నెంబర్లకు సమాచారం అందించి తగిన సహాయం పొందాలని కమిషనర్ తెలిపారు. రహదారులు, రోడ్లు, అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మోటార్ల ద్వారా తోడివేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పాదచారులు, వాహన చోదకులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రధాన ప్రాంతాలలో అధికారులు పర్యవేక్షిస్తున్నారని కమిషనర్ వెల్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ప్రజలు భారీ వృక్షాల సమీపంలో నిలవడం, విద్యుత్ స్థంబాలను తాకడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని కమిషనర్ సూచించారు. వరద నీరు పెరుగుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు కార్పొరేషన్ సూచించిన టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
తేదీ : 01 .11 .2022 భారత ప్రభుత్వం భారత వాతావరణ శాఖ, వాతావరణ కేంద్రం, అమరావతి. ---------------------------------------- వాతావరణ విశేషాలు:- ఆంధ్రప్రదేశ్ మరియు యానాం లో దిగువ ట్రోపో ఆవరణం లో తూర్పు మరియు ఈశాన్య గాలులు వీస్తున్నాయి . రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :- ------------------------------------------------------------- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-- -------------------------------------------------- ఈరోజు, రేపు మరియు ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ---------------------------------- ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమ :- ------------------- ఈరోజు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రము =========================