అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం
1990 దశకంలో మన ఇంటి ఆవరణల్లో ఏదో లోటు అనిపించడం మొదలైందని విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ అధినేత తాళ్లూరి సువర్ణకుమారి పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులోని ఆర్.ఎస్.ఆర్.నగరపాలక ఉన్నత పాఠశాల నందు అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'కిచ కిచ' లాడుతూ మనతోపాటు ఉండే పిచ్చుక కనపడకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్.వి.ఆర్.స్కూల్ కరస్పాండెంట్ అందే శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచం నలుమూలలా పక్షుల ప్రియులు,ముఖ్యంగా పిచ్చుకల స్నేహితులు ఉలిక్కిపడి జరిగిన తప్పును సవరించే ప్రయత్నాలకు నడుం బిగించారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్,పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు,గౌరవాధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నారాయణ, మురిగిపూడి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు