నెల్లూరు జిల్లా సాయుధ బలగాల సిబ్బంది 2 వారాల వార్షిక సమీకరణ (Annual Mobilization) రీఫ్రెష్ ట్రైనింగ్ ని ఉద్దేశించి జిల్లా యస్.పి. శ్రీ భాస్కర్ భూషణ్, IPS., గారు మాట్లాడుతూ వృత్తిపరమైన నైపుణ్యాలు, మెలుకవలు ఏకాగ్రతతో సాధన చేసి రీఫ్రెష్ ట్రైనింగ్ విజయవంతంగా ముగించాలని, క్రమశిక్షణలో మిగిలిన వారికీ ఆదర్శంగా ఉండాలని, ఉన్నత స్థాయి శారీరక ప్రమాణాలు, మానసిక సమతుల్యత ఈ శిక్షణలో మెరుగుపరుచుకోవడమే కాకుండా, సంవత్సరం పాటు శారీరక ఫిట్ నెస్ స్థాయిని కొనసాగించాలని తెలిపారు.