ప్రయోక్త :-

నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్   కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులతో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా, సమావేశం నిర్వహించారు. 


ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ.., కేంద్ర ఎన్నికలసంఘం ఆదేశాల ప్రకారం జిల్లా అంతటా ఎన్నికల నియమావళి అమల్లో ఉందని.., అందువల్ల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పారదర్శకంగా అమలయ్యేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. సి-విజిల్ యాప్ ద్వారా సాధారణ ప్రజలు కూడా ఎన్నికల నియమావళి ఉల్లంఘనల గురించి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి.., క్షేత్ర స్థాయికి వెళ్లి వాటిలోని వాస్తవాలను తెలుసుకుని.., నిబంధనల ఉల్లంఘన జరిగితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల్లో కూడా సి-విజిల్ యాప్ పట్ల అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలింగ్ సిబ్బంది ఎంపిక, పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలతో పాటు.., డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ఏర్పాట్లకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపికతో పాటు.., అదనంగా పోలింగ్ కేంద్రాలు అవసరం అయితే వెంటనే నివేదించాలన్నారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈవీఎం మిషన్ల ద్వారా ఉప ఎన్నిక జరుగుతున్నందున ప్రజలకు ఈవీఎం మిషన్ల ద్వారా ఓటు వేయడంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోనూ, కౌంటింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ కి అవసరమైన చర్యలు చేపట్టాలని.., పారదర్శకంగా స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.


ఈ సమీక్షా, సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ) హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ( ఆసరా) టి.బాపిరెడ్డి, మున్సిపల్ కమీషనర్  దినేష్ కుమార్, గూడూరు సబ్ కలెక్టర్   గోపాల కృష్ణ, డి.ఆర్.ఓ  చిన్న ఓబులేశు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.