ప్రయోక్త:-  నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని కలెక్టర్ ఛాంబర్ నందు శనివారం ఉదయం జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., జిల్లా వైద్య శాఖ అధికారులతో డిస్ట్రిక్ మెటర్నల్ డెత్ పై  సమీక్షా, సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకూ చోటు చేసుకున్న ప్రసూతి మరణాల గురించి రివ్యూ నిర్వహించిన కలెక్టర్.., మరణాలు ఎందుకు చోటు చేసుకున్నాయి..? దానికి సంబంధించి వైద్య నిపుణలు ఇచ్చిన నివేదికలు ఏమిటి..? సరైన వైద్యం అందించారా..? అందించినా కూడా మరణాలు సంభవించాయా..? అనే దానిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రసూతి మరణాలు జరగకుండా అంగన్ వాడీ, ఆశా, ఎ.ఎన్.ఎం లు క్షేత్ర స్థాయిలో బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని, వైద్యులు కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన గర్భిణిల ఆరోగ్య పరిస్థితిని గమనించి, అవసరమైన పరీక్షలు నిర్వహించి.., మెడిసిన్స్ అందించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రసూతి మరణాల సంఖ్య జీరోకి చేరుకోవాలని.., అందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


ఈ సమీక్షా, సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, డి.ఎం.హెచ్.ఓ   రాజ్యలక్ష్మి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.