ప్రయోక్త :-శ్రీమతి పోణకా కనకమ్మ ఆశయ సాధన సమితి
నెల్లూరు కన్వీనర్ బి.సురేంద్రనాద్ రెడ్డి సమాచార హక్కు
చట్టం ద్వారా కోట్ల రూపాయల అవినీతి ని వెలికి తీశారు.
నెల్లూరు పట్టణం లోని ప్రముఖ కస్తూరి దేవి విద్యాసంస్థ
నందు అనేక అవకతవకలు జరిగాయని సమాచార హక్కు
చట్టం ద్వారా తెలిసింది అని తెలిపారు.
ఆ విద్యాసంస్థ కు ఎంత స్థలం ఉందొ తెలపాలని అడుగగా
వారు సమాధానం చెప్పలేక పోతున్నారు.సమాచారం సకాలంలో ఇవ్వనందున ఖర్చుల కు 5 వేలు చెల్లించవలసిందిగా సమాచార కమీషన్ ఆదేశించింది. అయినప్పటికీ నేటికి ఎంత స్థలం ఉందొ తెలుపలేదు
అని అన్నారు.అక్కడ చదివిన విద్యార్థులు 20 ఎకరాల
విస్తీర్ణం ఉంటుందని తెలిపారు. కానీ అధికారుల వద్ద
సమాచారం లేకపోవడం విశేషం.
యాజమాన్యం నూతన బిల్డింగ్ లు కట్టలేదని
సమాచారం ఇచ్చారు.కానీ నూతన బిల్డింగ్ లు
ఉన్నాయని కాలేజి అనుమతులు తీసుకున్నారు.
3 వారాలలో ప్రభుత్వ సర్వేయర్ చే భూమిని
కొలిచి దరఖాస్తు దారుణకు ఇవ్వవలసిందిగా
తెలిపినప్పటికి నేటికి కొలతలు వేయలేదని తెలిపారు.
ఆ స్థలం విలువ 2000 కోట్ల  కు పైగా ఉన్నప్పటికీ
రికార్డులు లేకపోవడం తో పలు సందేహాలు వస్తున్నాయని
అన్నారు.అలాగే ఆ విద్యాసంస్థ 3600 మంది తో
రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థ
నేడు 240 మంది విద్యార్థులు మాత్రమే అక్కడ
చదవడం పాఠశాల అభివృద్ధి ఎలా తగ్గిపోయిందో
అర్ధం అవుతుంది అని అన్నారు.
నగర పాలక సంస్థ వద్ద ఎటువంటి రికార్డు లు లేవని
సమాచారం ఇచ్చారని అలాంటప్పుడు పన్నులు
వసూలు ఏ ప్రాతిపదికన చేస్తున్నారో తెలపాలని కోరారు.
యూనివర్సిటీ వారు ఎటువంటి రికార్డులు లేకుండా
అనుమతులు ఎలా ఇచ్చారో తెలపాలని గట్టిగా
డిమాండ్ చేశారు.
ఇంకా ఆ విద్యాసంస్థల్లో అనేక అక్రమాలు
బయటకొచ్చాయి...అనేక అక్రమ కట్టడాలు
నిర్మించి తక్కువ రేట్ కే బాడుగల కు ఇవ్వడం
జరిగింది. తక్కువ బాడుగకు తీసుకున్నవారు
10 వేలకు తీసుకుని నెలకు లక్ష రూపాయల బాడుగకు
అనధికారికంగా ఇవ్వడం జరిగింది.అయినా చర్యలు
తీసుకోక పోవడం ఏమిటి అని ప్రశ్నించారు.
అలాగే R&B రోడ్ వెడల్పు నిమిత్తం కోటికి పైగా
నిధులు వస్తే ఆ నిధులు ఏమయ్యాయో తెలపాలని
కోరారు.
R&B వారు రోడ్ ను తొలగిస్తే నగర పాలక సంస్థ
వారు ఆ విద్యాసంస్థకు కోటి రూపాయలు ఇవ్వడం
లో ఆంతర్యం అర్ధం కావడం లేదని కోరారు.
ఇలాంటి అవినీతి సంఘటనలు ఆ విద్యాసంస్థ
చుట్టూ అనేకం ఉండడం తో వాస్తవాలు వెలికి
తీయాలని ఆంద్రప్రదేశ్ గవర్నర్ కు తెలిపానని
ఈ విషయాలు ప్రజలకు కూడా తెలియాలని
ప్రెస్ మీట్ ద్వారా తెలుపుతున్నానని అన్నారు.
ఇటువంటి భారీ అవినీతిని వెలికి తీస్తున్నందుకు
అనేక బెదిరింపు లు కూడా వచ్చాయని
అయినా ప్రజా ప్రయోజనం కోసం నిరంతర
పోరాటం చేస్తున్నానని దీనికి ప్రజల సహకారం
అవసరం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సమాచార హక్కు చట్టం పై ఎప్పుడు సందేహాలు
వచ్చినా నెల్లూరు పట్టణం లోని  ప్రముఖ సమాచార
యాక్ట్ యాక్టివిస్ట్ రావూరి.రమేష్ బాబు సలహాలు
తీసుకుని సమాచార దరఖాస్తులు చేశానని
తెలిపారు.
అలాగే సమాచారం సకాలంలో ఇప్పించడానికి
ఆంద్రప్రదేశ్ సమాచార కమీషనర్ లు
బాగా సహకరించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రెస్ మీట్ నెల్లూరు నగరం టౌన్ హల్ నందు
జరిగింది.