ప్రయోక్త :- నెల్లూరు లో ని vrc కళాశాలలో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. రికార్డుల కు ఎటువంటి నష్టం రాలేదు.
ఈ విషయం తెలిసిన వెంటనే నెల్లూరు జాయింట్ కలెక్టర్
Vrc కళాశాలను పరిశీలించి వెంటనే ఈ సంఘటన పై
విచారణ జరుపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకు ఆ కళాశాల కు పాన్ కార్డ్ లేకపోవడం తో
వెంటనే పాన్ కార్డ్ తెప్పించి నిధుల ఖర్చు లో అవినీతి
లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.
కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పటికి వసతులు ఏర్పాటు
చేసుకోలేక పోతున్న vrc కళాశాల.ఇక్కడ పెద్ద పెద్ద
మేధావులు చదివారు.పెద్ద పదవులు అలంకరించారు.
కానీ వారు చదివిన కళాశాల ను పట్టించుకోవడం లేదు.
అధికారులు కూడా శ్రద్ద పెట్టడం లేదు.వాస్తవానికి
ఆ కళాశాల ఆస్థి 1000 కోట్ల పైనే ఉంటుంది.
కళాశాల బ్యాంక్ అకౌంట్ లో కోట్ల నగదు ఉంటుంది.
కానీ కనీస వసతులు కూడా లేకపోవడం కొసమెరుపు.