ప్రయోక్త :-  ఈ నెల 17 వ తేదిన జరుగ బోవు ఉప ఎన్నికైన తిరుపతి పార్లమెంటరి నియోజకవర్గం నందు జరుగు ఉల్లంఘనలపై సి విజిల్(cVIGIL) యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవలసినదిగా ఓటర్లను మరియు రాజకీయ పార్టీలను అదేవిధముగా పోటి చేస్తున అభ్యర్తులను కోరడమైనది. ఈ ఎన్నికల సందర్బముగా నిర్వహించు ప్రచారములో జరుగు ఉల్లంఘనలపైన మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ ఉల్లంఘనలు కానీ, ఎన్నికల వ్యయానికి సంబందించిన ఉల్లంఘనలు కానీ ఈ సి విజిల్(cVIGIL) యాప్ ద్వార వీడియో రూపములో కానీ, ఆడియో రూపములో కానీ, ఫోటోల ద్వారా కానీ ఎన్నికల సంఘానికి కానీ లేదా రిటర్నిగ్ అధికారికి కానీ మీ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సదరు ఫిర్యాదు పై కేవలము 100 నిమిషములలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఎన్నికలు పారదర్శకముగా నిర్వహించేందుకు ఓటర్లలో మరింత భాద్యతను పెంచేందుకు 

 ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ఈ అవకాశం కల్పించింది. సదరు ఫిర్యాదులపై, పోటి చేయుచున్న అభ్యర్తులపైన కానీ, రాజకీయ పార్టీల పైన కానీ చర్య తీసుకొనే అధికారం ఎన్నికల సంఘానికి కలదు. కావున భాద్యతాయుతమైన పౌరులందరూ ఈ సి విజిల్(cVIGIL) యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఫిర్యాదు   చేయవలసినదిగా ప్రభుత్వం వారు తెలిపారు.