ప్రయోక్త :-    ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 

పెండింగ్ పనులు పూర్తిపై 

ముఖ్యమంత్రిని కలసిన మాగుంట.శ్రీనివాసులురెడ్డి.


ఈ రోజు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి కాంపు కార్యాలయంలో      ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి YS Jagan Mohan Reddy  ని కలసి  ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగులో ఉన్న పనులు అందరి సహకారంతో వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తిచేయవలసినదిగా కోరగా దానికి  ముఖ్యమంత్రి  వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి వాటిని పూర్తిచేయుటకు సత్వర చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది అని ఒంగోలు MP తెలిపారు. 

1   నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైను త్వరితగతిన పూర్తీ చేయడం 

2   కనిగిరి నియోజక వర్గంలో ట్రిపుల్ ఐటి కాలేజీకి

 శంఖుస్థాపన .

౩   మార్కాపురంలో మెడికల్ కాలేజీకి శంఖుస్థాపన .

4  కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి  దర్శి నియోజకవర్గంలో దొనకొండ ప్రాంతంలో  ఆర్మీ లాబు మరియు ఏవీ నుంచి వి. యల్. యఫ్. స్టేషన్ ఏర్పాటుకు వారు సుముఖత చూపినందున వారితో మాట్లాడి వాటితోపాటు ఎక్కువ పరిశ్రమలు ఏర్పాటు.  కేంద్ర ప్రభుత్వం తరఫున డి. ఆర్. డి. ఓ. చైర్మన్ సతీష్  రెడ్డి తోనూ మరియు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి,  గౌతమ్ రెడ్డి తోను అందరం సంప్రదించి   పరిశ్రమల త్వరితగతిన ఏర్పాటు.

5  ఒంగోలు పట్టణ వాసులకు ఇళ్ళ స్థలాలకు సంబంధించిన కోర్టు పరమైన సమస్యలు పరిష్కారానికి అడ్వకేటు  జనరల్ తోను, తదితరులతోను కృషి చేసి స్థలాల ను త్వరగా

 ఏర్పాటు చేయుట.

6  వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు పూర్తయినందున, ఆర్. ఆర్. ప్యాకేజీ పనులు కూడా త్వరగా పూర్తిచేసి అనుకున్న సమయానికి తాగునీరు – సాగునీరు ప్రజలకు అందించే ఏర్పాటు. 

          

    పై పనులు పూర్తిచేయుటకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి   ఒంగోలు పార్లమెంటు సభ్యులు,  మాగుంట శ్రీనివాసులు రెడ్డి కృతజ్ఞతలు తెలియచేశారు.