ప్రయోక్త :-
రెండు జాతీయ రహదారులను కలుపుతూ కావలిలో రింగ్ రోడ్డు నిర్మించాలి
కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్
నెల్లూరు జిల్లా కావలి పట్టణం నడిబొడ్డుగుండా వెళ్తున్న రెండు జాతీయ రహదారులు వల్ల కావలి లో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతూ ట్రాఫిక్ జామ్‌లు, రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని, రెండు జాతీయ రహదారులను కావలి పట్టణానికి పడమర వైపున కలుపుతూ రింగ్ రోడ్డును నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే కలిసి చేసిన విజ్ఞప్తి కి సీఎం సానుకూలంగా స్పందించారు. చెన్నై–కలకత్తా లను కలుపుతూ ఉన్న జాతీయరహదారి –16 ఇప్పటికే పట్టణంలో నుంచే వెళ్తోందని సీఎం కు వివరించారు. అలాగే కావలి–సీతారామపురం కలుపుతూ జాతీయ రహదారి –167 బీజీ ని రూ.450 కోట్లుతో డబుల్‌రోడ్డుగా విస్తరించడానికి చర్యలు తీసుకొన్నందుకు కావలి నియోజకవర్గ ప్రజల తరుపున సీఎంకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాలను కోస్తా జిల్లాలను కలిపే జాతీయ రహదారి –167 బీజీ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ట్రాఫిక్ అత్యంత రద్దీగా ఉంది. ఈ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలన్నీ కూడా జాతీయ రహదారి–16 లో కలిసి అటు విజయవాడ, విశాఖపట్నంల వైపు రాకపోకలు సాగించడానికి కావలి పట్టణంలో నుంచే చేయాల్సి ఉంటుందని సీఎంకు ఎమ్మెల్యే వివరించారు. జాతీయ రహదారి –167 బీజీ దుత్తలూరు వద్ద తెలంగాణలోని నల్గొండ జిల్లా నకిరేకల్ నుంచి మన రాష్ట్రంలోని మాచర్ల, మార్కాపురం, కనిగిరి, పామూరు, వెంకటగిరి ల మీదగా చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు వరకు ఉన్న జాతీయ రహదారి–565 ను కలుస్తోందని చెప్పారు. దీనివల్ల తెలంగాణ నుంచి ప్రకాశం, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు రాకపోకలు సాగించే వారు కూడా కావలి–సీతారాంపురం జాతీయ రహదారి ని సద్వినియోగం చేసుకొంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ నేపధ్యంలో కావలి పట్టణంలో వాహనాలు రద్దీ పెరిగిపోతున్నాయి. అలాగే కావలి పట్టణంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కాలనీలలో ఉన్న 6,000 మంది పేదలు, కొత్తగా కావలిలో ఏర్పాటు చేస్తున్న ‘డాక్టర్ వైఎస్సార్ జగనన్న రామిరెడ్డి ’ కాలనీలో 9,000 మంది పేదలకు రాకపోకలు సాగించడానికి దగ్గరలో మంచి రోడ్డు వసతి లేక అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అందుకే కావలి పట్టణంలోని మద్దూరుపాడు వద్ద జాతీయ రహదారి–16 నుంచి పడమర వైపున కొత్తగా రోడ్డు ను ప్రారంభించి ఈ రెండు కాలనీలు సమీపంలో మీదగా ముసునూరు వద్ద ఉన్న జాతీయ రహదారి–16 కు కలిపేలా నూతనంగా రోడ్డు ను నిర్మించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. నూతన రోడ్డు కు మధ్యలో జాతీయ రహదారి –167 బీజీ కూడా కలుస్తోందని, దీనివల్ల కావలి పట్టణ ప్రజలకు సౌలభ్యంతో పాటు, జాతీయ రహదారులపై ప్రమయాణించే వారికి ట్రాఫిక్ జామ్‌లతో ఇబ్బందులు లేకుండా ఉండి ప్రమాదాలు నివారణకు దోహదపపడుతోందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సీఎం కు వివరించారు. దీంతో రెండు జాతీయ రహదారులను కలుపుతూ కొత్తగా నిర్మించే రోడ్డు వల్ల ప్రజలకు , వాహదారులకు అన్ని రకాలుగా సానుకూత ఉంటుందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసి నిర్ధిష్టమైన చర్యలు తీసుకొంటానని సీఎం జగన్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కి తెలిపారు. అలాగే కావలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీల్లో ఇళ్లు ధ్వంసమైపోయి, అసంపూర్తిగా ఆగిపోయిన పక్కా గృహాలన్నింటినీ జగనన్న కాలనీ పధకంలో మంజూరు చేస్తానని సీఎం చెప్పినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కావలి, అల్లూరు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండేలా నియామకాలు చేస్తామని సీఎం తెలిపారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
0 కామెంట్‌లు