ప్రయోక్త :-

నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ నందు శనివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ)   హరేంధిర ప్రసాద్, గూడూరు సబ్ కలెక్టర్    ఆర్.గోపాలకృష్ణతో కలిసి..., ఆర్.డి.ఓ లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులతో వడగాలుల తీవ్రత, ప్రాణ నష్టం కలగకుండా తీసుకోవాల్సి చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని PHC, CHC లలో వడగాలుల తీవ్రత వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే వారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆశా, ANM లకు ట్రైనింగ్ ఇవ్వాలని,  ORS ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాభావ మండలాల్లో మంచినీటి కొరత రాకుండా, చర్యలు తీసుకోవాలని RWS అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులూ వడదెబ్బ బాధితులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. NRGS పనులు ఉదయం 6.00 గం. నుంచి ఉదయం 11.00 గం. వరకూ.., సాయంత్రం 4.00 గం నుంచి సాయంత్రం 6.00 గం. వరకూ మాత్రమే జరగాలని అధికారులను ఆదేశించారు. FM, లోకల్ ఛానెల్స్ లోనూ, పత్రికల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేలా సమాచార శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వడగాలుల వలన జిల్లాలో ఎలాంటి మరణాలు సంభవించరాదని, ఒకవేల మరణిస్తే వారికి నష్ట పరిహారం అందించాలన్నారు.

ఈ సమీక్షా, సమావేశంలో DPM    వాసుదేవ రావు, ఆర్.డి.ఓ లు, మున్సిపల్ కమీషనర్లు, జిల్లా అధికారులు హాజరయ్యారు.