🅰🅿️

ప్రయోక్త :-

*🌈ఏపీ: మేలో టెట్ నోటిఫికేషన్...!💫*

*🙋‍♂️ఏపీ టెట్ 2021*

💁‍♂️ఉపాధ్యాయుల పట్ల సమాజంలో ఉండే గౌరవం, ఆదరణ ఎనలేనిది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువంటే..ఎంతో క్రేజ్‌! లక్షల మంది సర్కారీ టీచర్‌గా బోధనా రంగంలో స్థిరపడాలని ఉవ్విళ్లూరుతుంటారు.

💁‍♂️కానీ, టీచింగ్‌ వృత్తిలోకి ప్రవేశించాలంటే.. తొలుత టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)లో అర్హత సాధించడం తప్పనిసరి. కాగా, మేలో ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

💁‍♂️ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా ఏపీ టెట్‌ అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

💁‍♂️సమాజ ప్రగతికి కీలకమైన విద్యాబోధనలో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ)...టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)ను ముందుకు తెచ్చింది.

💁‍♂️కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు‘టెట్‌’ను  నిర్వహిస్తున్నాయి.  గతంలో టెట్‌ అర్హతా గుర్తింపు ఏడేళ్లు కాగా, ప్రస్తుతం టెట్‌లో ఒక్కసారి అర్హత సాధిస్తే సరిపోతుంది.

💁‍♂️ఏపీ టెట్‌కు సంబంధించి.. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు(ఎస్‌జీటీ) పేపర్‌–1ఏ; ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించేవారు(స్కూల్‌ అసిస్టెంట్‌) పేపర్‌–2ఏ రాయాల్సి ఉంటుంది. 

*🙋‍♂️20 శాతం వెయిటేజీ.*

💁‍♂️ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాలంటే.. డీఎస్సీ రాయాలి.

💁‍♂️దాని కంటే ముందు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) నిబంధనల మేరకు టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. అంతేకాకుండా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించినవారికి ఉపాధ్యాయ నియామక పోస్టుల్లో 20 శాతం వెయిటేజీ లభిస్తుంది.

*🙋‍♂️అర్హతలు.*

💁‍♂️టెట్‌ రాసేందుకు పేపర్‌ను బట్టి ఇంటర్మీడియెట్, బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీతోపాటు డీఈడీ/బీఈడీ /లాంగ్వేజ్‌ పండిట్‌ /బీఎల్‌ఈడీ/డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ /బీపీఈడీ తత్సమాన కోర్సులు చదివుండాలి. 

*🙋‍♂️పరీక్ష విధానం.*

💁‍♂️ఏపీ టెట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 1–5 తరగతుల టీచర్‌ పోస్టులకు పోటీ పడేవారు పేపర్‌ 1ఏకు; 6–8 తరగతుల టీచర్‌ పోస్టులకు పోటీ పడేవారు పేపర్‌ 2ఏకు హాజరవ్వాల్సి ఉంటుంది.

💁‍♂️ఆయా పోస్టులకు పేర్కొన్న అర్హతలు కలిగిన వారు రెండు పేపర్లకూ హాజరవ్వొచ్చు. టెట్‌ ప్రశ్నపత్రం మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. 


💁‍♂️పేపర్‌ 1బీ, పేపర్‌ 2బీలు స్పెషల్‌ స్కూల్స్‌లో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌కు ఉద్దేశించినవి. డీఈడీ, బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్‌ కమ్యూనిటీ బేస్డ్‌ రిహాబిలిటేషన్‌ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు.


💁‍♂️రెగ్యులర్‌ స్కూల్స్‌లో పోస్టులకు పోటీ పడాలనుకునే అభ్యర్థులు పేపర్‌ 1ఏ, పేపర్‌ 2ఏలకు హాజరవ్వాల్సి ఉంటుంది.