ప్రయోక్త :-
నెల్లూరు, ఆగస్టు 24: కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో సచివాలయాల పరిధిలోని ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించుకునేలా వాలంటీర్లు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం దర్గామిట్ట సుజాతమ్మ కాలనీలోని 36/1, 36/2 సచివాలయాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా సచివాలయ సిబ్బంది పనిచేయాలన్నారు. బియ్యం కార్డులకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ వేగంగా చేపట్టాలని సూచించారు. అలాగే చేయూత పథకం నగదు అర్హులందరికీ అందిందా.. లేదా అనే వివరాలను కూడా సేకరించాలన్నారు. సచివాలయం పరిధిలోని జగనన్న ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను మొదలు పెట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సచివాలయంలోని సిబ్బంది మూమెంట్, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి అడిషనల్ కమిషనర్ ప్రసాదరావు కలెక్టర్ కు వివరించారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ అడ్మిన్లు దేవేంద్ర, హారిక, సచివాలయ సిబ్బంది సల్మా, యాస్మిన్, రామారావు, శ్రీధర్, హెలెన్, అరుణ, సుమతి, రామకృష్ణ, మాజీఫా, వీఆర్వోలు భాషయ్య, లలితమ్మ, వాలంటీర్లు పాల్గొన్నారు.
...............
నెల్లూరు, ఆగస్టు 24: అగ్రిగోల్డ్ ప్రైవేట్ కంపెనీ చేతిలో మోసపోయి ఆర్థికంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవడం ఓ చారిత్రాత్మక నిర్ణయంగా జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి 'అగ్రిగోల్డ్ బాధితులకు.. జగనన్న భరోసా' కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బటన్ నొక్కి అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లోకి నగదును జమ చేశారు.
అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 31814 మంది అగ్రిగోల్డ్ బాధితులకు సుమారు 33 కోట్ల 25 లక్షల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసినట్లు చెప్పారు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వం ఆదుకోవడం అనేది దేశంలో ఎక్కడా జరగలేదని, అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను చూసి వారికి అండగా నిలిచిన ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రజలందరూ కూడా ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఆన్ లైన్ లావాదేవీలకు సంబంధించి ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించాలని, చరవాణిలకు వచ్చే వివిధ మెసేజ్ లు, లింక్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే సైబర్ నేరగాళ్లు మన బ్యాంకు ఖాతాలోని నగదును కాజేసే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, సిఐడి అడిషనల్ ఎస్పీ రాజేంద్ర కుమార్, సిఐడి డి.ఎస్.పి రాంబాబు, డి ఆర్ ఓ చిన్న ఓబులేసు, ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్, సిఐడి సిబ్బంది మస్తానయ్య, ఆజాద్, దయానిధి, మోహన్ కృష్ణ, కిషోర్ బాబు, హాజరత్ బాబు, అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల అభిప్రాయాలు
.....................
మోసపోయిన డబ్బులు తిరిగి వస్తాయి అనుకోలేదు
- కే పుష్పలత, కొండాయపాలెం గేటు, నెల్లూరు
......................
నేను ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు 19 వేల రూపాయలను అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశాను. అయితే ఆ కంపెనీ మోసం చేయడంతో అందరి చుట్టూ తిరిగి ఇక డబ్బులు రావని బాధపడ్డాను. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ డబ్బులను నా అకౌంట్ లో జమ చేయడం చాలా సంతోషంగా ఉంది.
....................................
ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటా
- షీలా ఝాన్సీ, బుజ బుజ నెల్లూరు
- నేను ఒక ప్రైవేటు విద్యా సంస్థలో టీచర్ గా పని చేస్తున్నాను. అగ్రిగోల్డ్ సంస్థ లో 11 వేల రూపాయలు దాచుకున్నాను. అయితే సంస్థ మోసం చేయడంతో ఇక చేసేది లేక ఊరుకున్నాను. అయితే ప్రస్తుతం వాలంటీర్లు మా ఇంటికి వచ్చి నా వివరాలు నమోదు చేసుకుని ఈనెల 24 వ తేదీన అగ్రిగోల్డ్ డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయని చెప్పడంతో చాలా సంతోషపడ్డాను. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాను.
..............................
పేదల దేవుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
- కే లీలావతి, వేదాయపాలెం
- నేను జయశ్రీ కర్రీస్ పాయింట్ నిర్వహిస్తున్నాను. ఎంతో కష్టపడి దాచుకున్న నగదు అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేయడంతో ఇక రాదని బాధపడ్డాను. అయితే ముఖ్యమంత్రి మీకు నేను ఉన్నాను.. భరోసాగా నిలుస్తాను అని హామీ ఇచ్చి ఆ మాట ప్రకారం మాలాంటి నిరుపేదలను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా పిల్లల చదువుకు అమ్మ ఒడి, మా వ్యాపార అభివృద్ధికి జగనన్న తోడు, ఇప్పుడు అగ్రిగోల్డ్ డబ్బులు ఇప్పించి మమ్మల్ని ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మాకు కనిపించే నిజమైన దేవుడు.
...............................
నెల్లూరు, ఆగస్టు 24: జిల్లాలో వివిధ దశల్లో ఉన్న వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు, బలోపేతంపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, ఆక్సిజన్ పైపులైన్ల ఏర్పాటు ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర మౌలిక వనరులను సమకూర్చుకోవాలని ఆదేశించారు. గూడూరులో ఏర్పాటుచేసిన కరోనా నిర్ధారణ పరీక్షల ల్యాబ్ ను అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన సదుపాయాలను ముందుగానే సమకూర్చుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి ఎన్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేంధిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, ఏపీ ఎంఎస్ ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ విజయ భాస్కర్, ఎస్ ఇ చిట్టి బాబు, డిఎంహెచ్ఓ శ్రీమతి రాజ్యలక్ష్మి, పంచాయతీ రాజ్ ఎస్ఇ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ భరత రత్నం, నగరపాలక సంస్థ ఎస్ఈ సంపత్ కుమార్, ఇఇలు సంజయ్, చంద్రయ్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
..................................
నెల్లూరు, ఆగస్టు 25: జిల్లాలో సచివాలయాలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్ లు, డిజిటల్ లైబ్రరీల భవన నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి “స్పందన” కార్యక్రమంపై ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ పై నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనాతో సహజీవనం తప్పదన్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, ఆక్సిజన్ ప్లాంట్లు, సిలిండర్లు ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీ లు, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టేందుకు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అక్టోబర్ రెండో తేదీ లోగా పెండింగ్లో ఉన్న గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సచివాలయాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ వివిధ పథకాలకు సంబంధించి అర్హత పొందిన జాబితాను పరిశీలించి మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 90 రోజుల్లో ప్రస్తుతం ఉన్న లేఅవుట్లలో గాని, నూతనంగా ఏర్పాటు చేయనున్న లే అవుట్ లలో గాని కేటాయించాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మూడో ఆప్షన్ అనగా ప్రభుత్వమే ఇళ్లను నిర్మించే ఆప్షన్ ను ఎంచుకున్న లబ్ధిదారులను 20 మందిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వారికి ఒక హెడ్ మేస్త్రి ని కేటాయించి ఇళ్ల నిర్మాణ పనులను మొదలు పెట్టించాలని సూచించారు. బ్యాంకులతో సంప్రదించి లబ్ధిదారులకు పావలా వడ్డీ రుణాలను ఇప్పించాలన్నారు. జగనన్న కాలనీల్లో విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యం వెంటనే కల్పించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ లో పంట నమోదును వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి ఈ క్రాప్ నమోదును పరిశీలించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో, మండల స్థాయిలో నిర్వహించిన వ్యవసాయ సలహామండలి సమావేశాల్లో చర్చించిన రైతుల సమస్యలపై జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో చర్చించి పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ విజయ రావు, జాయింట్ కలెక్టర్లు హరేంధిర ప్రసాద్, గణేష్ కుమార్, విదేహ్ ఖరె, ఎన్ విజయకుమార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ శ్రీ ఫర్హాన్ అహ్మద్ ఖాన్, డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి, డిపిఓ ధనలక్ష్మి, పంచాయితీ రాజ్ ఎస్ఇ శ్రీ శ్రీనివాసులురెడ్డి, డ్వామా, హౌసింగ్ పీడీలు తిరుపతయ్య, వేణుగోపాల రావు, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడి హనుమాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
...............................................
నెల్లూరు, ఆగస్టు 25: న్యూమోనియా వ్యాధిని అరికట్టేందుకు చిన్న పిల్లలకు న్యూమొకోకల్ కాంజుగేటివ్ టీకాను తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు సూచించారు. బుధవారం నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వెంగల్ రావు నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నందు న్యూమొకోకల్ కాంజుగేటివ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ ను ఏడాదిలోపు చిన్నారులకు 6 వారాలకు, 14 వారాలకు, 9 నెలలకు బూస్టర్ డోసు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ టీకాను జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం, శనివారం నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ స్వర్ణలత, వైద్యులు ఉమా మహేశ్వర రావు, అమరేంద్ర, అమర్ నాథ్ రెడ్డి, సందీప్, డెమో అధికారి శ్రీనివాసులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
..............................
నెల్లూరు, ఆగస్టు 26 : జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర కస్తూర్భా కళాక్షేత్రంలో ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సమన్వయ కేంద్రాన్ని (జీవో- ఎన్జీవో కోఆర్డినేషన్ సెంటర్) కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల పట్ల ప్రజలను చైతన్యం చేయడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమన్నారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రజాసేవే పరమావధిగా భావించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు
ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. జిల్లాలో 70 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. కరోనా వ్యాక్సినేషన్, జగనన్న పచ్చ తోరణం పథకాల అమలులో స్వచ్ఛంద సంస్థలు ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. మారుమూల గ్రామాల్లో కూడా కరోనాపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా పనిచేసి జిల్లాను కరోనా రహిత జిల్లాగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా కరోనా నిబంధనలను ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ కేంద్రాన్ని కలెక్టర్ ప్రత్యేక చొరవతో నెల్లూరులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించుకొని ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి సహకరించాలని కోరారు. అనంతరం పలువురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి శ్రీమతి ధనలక్ష్మి, డిఆర్డిఎ పిడి సాంబ శివారెడ్డి, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ మహేంద్ర రెడ్డి, స్వచ్ఛంద సంస్థల కోఆర్డినేటర్ కే సహదేవయ్య, కమాండింగ్ ఆఫీసర్ యుగంధర్ రెడ్డి, సెట్నల్ సీఈవో పుల్లయ్య, పలువురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
.................................
నెల్లూరు, ఆగస్టు 26:--- జిల్లాలో కొత్తగా 100 యువ క్లబ్బు లను ఏర్పాటుచేసి సమాజాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున యువజన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎం చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టవలసిన యువజన కార్యక్రమాలపై జిల్లా సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 384 యూత్ క్లబ్ లు ఉన్నాయని కోవిడ్-19, క్రీడలు,ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలలో యువతీ యువకులను భాగస్వాములను చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరంజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా మరో 100 యువ క్లబ్బుల నులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. యువ క్లబ్బులు చురుగ్గా పని చేసే లాగా చొరవ చూపాలన్నారు. నేటి యువతలో జాతీయత భావాలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా యువత తట్టుకునే విధంగా వారిని శారీరకంగా మానసికంగా సిద్ధం చేయాలన్నారు. 75 సంవత్సరాల ఆజాదీ క అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్య పోరాటం గురించి యువతకు అవగాహన కల్పించాలన్నారు. ఇందులో భాగంగా ర్యాలీలు నిర్వహించాలన్నారు. అంతేకాకుండా మూడో దశ కోవిడ్ హెచ్చరికల నేపథ్యంలో కోవిడ్ 19 నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువత తో ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించాలని స్పష్టం చేశారు. గృహనిర్మాణ సముదాయాలలో యువతి యువకులకు కొన్ని ప్రాంతాలను కేటాయించి మొక్కలు నాటి పెంచే కార్యక్రమాన్ని అప్పగించాలన్నారు. యువ క్లబ్బుల పనితీరును మూడునెలలపాటు పర్యవేక్షించాలని సూచిస్తూ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లా స్థాయిలో 2 కే రన్ గాని, 5 కె రన్ గాని ఆజాదీ అమృత్ మహోత్సవం పేరిట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సెప్టెంబర్ 11 వ తేదీన జిల్లా వ్యాప్తంగా 75 గ్రామాల్లో ప్రతి గ్రామంలో 75 మంది యువజనులతో ఫిట్ ఇండియా స్వాతంత్ర పరుగును నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో లో సంయుక్త కలెక్టర్ అభివృద్ధి గణేష్ కుమార్, జడ్పీ సీఈవో శ్రీమతి పి సుశీల, డి ఆర్ డి ఎ పి డి శ్రీ సాంబశివ రెడ్డి, డి పి ఓ ధనలక్ష్మి, సి పి ఓ పెద్దయ్య, ఎల్ డి ఎం రాం ప్రసాద్ రెడ్డి, సీఈవో సెటినెల్ సీఈవో పుల్లయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డి డి జీవ పుత్ర కుమార్ , నావల్ఎన్ సి సి కమాండింగ్ అధికారి కెప్టెన్ యుగంధర్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి వెంకటేశ్వర ప్రసాద్ ,కేంద్ర క్షేత్ర ప్రచార సహాయకులు హరికృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. ..........................................
నెల్లూరు, ఆగస్టు 27:-- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులికాట్, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి 2020-21 వ సంవత్సరంలో 60 రకాల వలస భౌగోళిక పక్షులు 1,84,09 2 వచ్చాయని జిల్లా అటవీ శాఖ వన్యప్రాణి విభాగం సూళ్లూరుపేట వారు తెలిపారు.అలాగే ఈ ప్రాంతాలకు 1,03,060 మంది సందర్శకులు వచ్చారన్నారు. అంతరించిపోతున్న సముద్రపు తాబేళ్లు గుడ్లను సముద్ర తీరము నందు సేకరించి 5 హాచరీల ద్వారా 16,444 గుడ్లను పొదిగించి 16,437 తాబేళ్ల పిల్లలను సముద్రంలో విడిచి పెట్టడం జరిగిందన్నారు.
................................................
నెల్లూరు, ఆగస్టు 27 : జిల్లాలో వివిధ దశల్లో ఉన్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్ ల భవన నిర్మాణ పనులను వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరు వారి క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 146 సచివాలయ భవన నిర్మాణాలు పూర్తయ్యాయని, 161 భవన నిర్మాణాలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని చెప్పారు. అలాగే 143 రైతు భరోసా కేంద్రాలు, 81 వైయస్సార్ విలేజ్ క్లీనిక్ ల భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు, రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస రెడ్డి, ఎక్సిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీ రవి కుమార్, శివారెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
................................................
నెల్లూరు, ఆగస్టు 28 : వాలంటీర్లు తమ పరిధిలోని జగనన్న ఇళ్ల లబ్ధిదారులతో మమేకమై ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యేలా వారికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు వాలంటీర్లకు సూచించారు. శనివారం ఆత్మకూరు మున్సిపాలిటీ 19 వ వార్డు, 3, 4, 21 వార్డుల పరిధిలోని రెండు సచివాలయాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు గ్రూపులోని మహిళలకు పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేస్తున్నామని, ఈ రుణాలను ఉపయోగించుకుని ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యేలా వాలంటీర్లు మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సిబ్బంది పనిచేయాలన్నారు. అనంతరం పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విదేహ్ ఖరె, ఆర్ డి ఓ చైత్ర వర్షిని, జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేనేజర్ పద్మ, మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు
.......................
నెల్లూరు, ఆగస్టు 28 : జిల్లాకు మరో 25 వేల ఇళ్లు మంజూరయ్యాయని, అన్ని డివిజన్లలో ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా మొదలుపెట్టాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఆత్మకూర్ మున్సిపల్ పరిధిలోని నెల్లూరు పాలెం సమీపంలో నిర్మిస్తున్న జగనన్న ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక అధికారులకు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక లక్ష్యం నిర్దేశించి ఆ మేరకు వారికి రేటింగ్ ఇస్తామని, దీని ప్రకారం భవిష్యత్తులో ఇచ్చే అవార్డులలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేక అధికారులు బాధ్యతగా పనిచేసి సెప్టెంబర్ 30వ తేదీ లోపు అన్ని ఇంటి నిర్మాణాలు బేస్మెంట్ స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం బిల్లులు ఈ వారంలో ఆలస్యమైన విషయం వాస్తవమేనని, జిల్లా వ్యాప్తంగా 12 కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉందని, సెప్టెంబర్ మొదటి వారంలో ఆ బిల్లులు మంజూరవుతాయన్నారు. మహిళలకు ఇళ్ల నిర్మాణ విషయంలో ఆర్థిక సహాయం అందించేలా మెప్మా ఆధ్వర్యంలో రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. పొదుపు మహిళలు ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని సూచించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు లేఅవుట్లలోనే సిమెంటు, ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ వ్యాప్తి గురించి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో వైరస్ వ్యాప్తి నివారణ కోసం కఠినమైన ఆంక్షలు విధించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో జిల్లాలో ఇప్పటివరకు 18 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు మరో 12 లక్షల మందికి చేయాల్సి ఉందని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ చైత్రవర్షిని మాట్లాడుతూ అర్ధాంతరంగా ఆగిపోయిన తాసిల్దారు, ఆర్డీవో కార్యాలయాల భవన నిర్మాణ పన్నుల విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అంతకుముందు జాయింట్ కలెక్టర్ విదేహ్ ఖరె మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 600 ఇళ్లు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని, మరో రెండు వేల ఇళ్లు త్వరలోనే పూర్తయ్యే దశలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు వేణు గోపాల రావు, శేషయ్య, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ పద్మ, మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు, హౌసింగ్ డీఈ నటరాజ్, ఏఈ శాంతకుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు
................................................
నెల్లూరు, ఆగస్టు 30 : ఎందరో కవులు, కళాకారులకు పుట్టినిల్లు నెల్లూరు గడ్డ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు భాషా ప్రయోగాలు, పరిశోధనలు జాతీయ సదస్సును ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అను మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం అన్ని విశ్వవిద్యాలయాల్లో ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. భాషా చైతన్య యాత్రల పేరుతో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను సందర్శిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన కవులు, రచయితలను సత్కరిస్తున్న ట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో మాట్లాడే భాషల్లో తెలుగు భాష ఐదో స్థానంలో ఉందని, మనదేశంలో మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ఉందని చెప్పారు. అయితే యునెస్కో ప్రకటించిన జాబితాలో తెలుగు భాష అట్టడుగు స్థాయికి చేరడం బాధాకరమైన విషయమన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే తెలుగు భాషకు ఈ దుర్గతి పట్టిందన్నారు. ప్రస్తుతం తెలుగు అకాడమికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. మాతృభాష అనేది మన రక్తంలో కలిసి ఉంటుందని, మాతృభాషను గౌరవించడం మన ప్రథమ కర్తవ్యం అన్నారు. శాసనాల ద్వారా తెలుగు భాష ఉనికి వెలుగులోకి వచ్చిందని, 8వ శతాబ్దం అంతంలో తెలుగు లిపి గుర్తించబడిందని, 11వ శతాబ్దంలో నన్నయ్య, ఎర్రన్న, తిక్కన సోమయాజి వంటి మహాకవులు భాషారూపాన్ని మన కళ్ళముందు ఆవిష్కరించారన్నారు. 18వ శతాబ్దం వరకు కూడా అనువాద సాహిత్యమే ప్రాచుర్యంలో ఉందన్నారు. ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా తెలుగు భాష పరిపుష్టి చెందిందన్నారు. అటువంటి భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలుగు, సంస్కృతం వేరు కాదని, రెండింటికీ విడదీయరాని సంబంధం ఉందన్నారు. అందుకే తెలుగు అకాడమీని తెలుగు, సంస్కృత అకాడమీ గా మార్చినట్లు చెప్పారు. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు మాతృభాష గొప్పతనాన్ని తెలియజేయాలన్నారు. ఆంగ్ల భాష అవసరం కూడా ప్రస్తుతం వివిధ ఉద్యోగాల రీత్యా తప్పనిసరిగా మారిందని, అందుకే పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్ట్ గా తప్పనిసరి చేస్తూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. తెలుగు అకాడమికి సొంత భవనాన్ని నిర్మించాలన్నది తన లక్ష్యంగా ఆమె పేర్కొన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి సహకారంతో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. తదుపరి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అధ్యాపకులు లక్ష్మీపార్వతిని ఘనంగా సత్కరించారు.
అనంతరం ప్రముఖ కవి రాచపాలెం రఘు రచించిన రాచపాళి రత్నావళి పుస్తకాన్ని లక్ష్మీపార్వతి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ రెక్టార్ చంద్రయ్య, రిజిస్ట్రార్ ఎల్ విజయకృష్ణరెడ్డి, తెలుగు శాఖ ఇన్చార్జ్ అధ్యక్షులు డాక్టర్ పి సుబ్బరాజు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడు, విఎస్ యు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజ ఎస్ నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కిరణ్మయి, మధుమతి, సునీత, మణికంఠ, ఉదయశంకర్ అల్లం, రచయితలు పాతూరి అన్నపూర్ణ, గంగి శెట్టి శివకుమార్, చిన్ని నారాయణరావు, రాచపాలెం రఘు తదితరులు పాల్గొన్నారు.
................................................
నెల్లూరు, ఆగస్టు 30 : తెలుగు అకాడమికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నెల్లూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, ప్రస్తుతం తెలుగు భాషను దశదిశలా చాటేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగా భాషా చైతన్య సదస్సులను అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో నిర్వహించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక పాఠశాలల స్థితిగతులు పూర్తిగా మారిపోయాయని, నాడు నేడు పథకం కింద పాఠశాలలను అభివృద్ధి చేసి తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాతృభాషతో పాటు ఆంగ్ల భాషా పరిజ్ఞానం కూడా ఎంతో అవసరమన్నారు. ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానుభావుడు దివంగత నందమూరి తారక రామారావు అని, అలాగే తెలుగు ప్రాచీన హోదా కల్పించిన నేత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఇప్పుడు తెలుగు అకాడమికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ భాషాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. తెలుగుకు అన్యాయం జరుగుతుందని కొన్ని పత్రికలు ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల యునెస్కో జాబితాలో కనుమరుగయ్యే భాషల్లో తెలుగు భాష ఉందన్నారు. అలాంటి పరిస్థితి నుంచి తెలుగు భాషను బతికించాలనే సంకల్పంతో తెలుగు అకాడమీ కృషి చేస్తోందన్నారు. త్వరలోనే మన రాష్ట్రానికి పూర్తిస్థాయిలో తెలుగు అకాడమీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఒక వారం రోజుల్లో ఇంటర్మీడియట్ పుస్తకాలను కూడా ముద్రించి అకాడమీ ద్వారా పంపిణీ చేస్తామన్నారు. తిరుపతిలో అకాడమీ భవన ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తెలుగు భాషాభివృద్ధికి సేవలందిస్తున్న పలువురు రచయితలు, కవులను సన్మానిస్తూ వారి సూచనలు, సలహాలు తీసుకుంటూ తెలుగు భాషకు పూర్వ వైభవం కల్పించేలా తెలుగు అకాడమీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
అంతకుముందు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి నగరంలోని ఆర్ అండ్ బి అతిథిగృహానికి చేరుకోగా డిఆర్వో చిన్న ఓబులేసు, ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్, తాసిల్దార్ నాజర్, విక్రమ సింహపురి అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ మధుమతి, డాక్టర్ కే సునీత మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
................................................
నెల్లూరు, ఆగస్టు 30 : త్వరలోనే తెలుగు అకాడమీ, తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం భవన నిర్మాణాలకు సంబంధించి కార్యాచరణ మొదలు కానున్నట్లు రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి వెల్లడించారు. ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎర్రగుంటలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అధ్యయన కేంద్రంలోని పలు విభాగాలను నిశితంగా పరిశీలించి తాళపత్ర గ్రంధాలు, జానపద కళలు, పలు శాసనాలు, చారిత్రక గ్రంథాలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో భాషాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ఆమె వీక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మైసూర్ లో ఉన్న ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కృషిచేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు అకాడమీ, తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం భవనాలను నిర్మించేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని, స్థలాలను సేకరించి భవనాలు నిర్మించేలా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఈ భవనాలు ఏర్పాటు ప్రక్రియ మొదలు కానుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ డి మునిరత్నం నాయుడు, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఎల్ విజయ కృష్ణారెడ్డి, సీనియర్ విద్యాత్మక సిబ్బంది శ్రీ మిరియాల సత్యనారాయణ, రాంబాబు, రమేష్, నాగ శేషు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
.......
పేరెంట్స్....డిమాండ్లు.....
✍️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆంధ్ర ప్రదేశ్ విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ విడుదల చేసిన జీవో నెంబర్ 53 మరియు 54 లను అనుసరించే ప్రభుత్వం ప్రకటించిన ఫీజులను ప్రైవేటు కళాశాల పాఠశాలల్లో ఖచ్చితంగా అమలు చేయాలి
✍️ అమలు చేయని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ దినం ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ కార్యాలయం లో ది ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రులను చైతన్య పరచడానికి, ప్రభుత్వం ప్రకటించిన ఫీజులను అమలు కునేందుకు విద్యార్థి ,విద్యార్థి తల్లిదండ్రులు కదలి కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి టీ వరప్రసాద రావు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది
✍️ ఈ కార్యక్రమంలో ది ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శిఖరం నరహరి, ఎం అంకయ్య కే శ్రీనివాసరావు పి చలపతి ఎం బాల సుబ్రహ్మణ్యం బి సురేష్ తదితరులు పాల్గొన్నారు . ✍️ ఈ సందర్భంగా శిఖరం నరహరి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్ర ప్రదేశ్ విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన ఫీజులకు సంబంధించిన నిర్ణయాలను విస్తృతంగా విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులలో విస్తృత ప్రచారం చేయాలని, నిర్ణయాలను కఠినంగా అమలు చేయాలి
✍️ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కళాశాల, పాఠశాలాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ✍️ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి గురవుతున్న విద్యార్థుల్ని, విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యా వ్యవస్థను, కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.
1.ఆంధ్రప్రదేశ్ విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ విడుదల చేసిన జీవో నెంబర్ 53, 54 ల ప్రకారం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. అధిక ఫీజులు వసూలు చేసే కళాశాల, పాఠశాలాల గుర్తింపును రద్దు చేసి, ఆయా కళాశాల,పాఠశాలాల యాజమాన్యాల పై క్రిమినల్ కేసులు పెట్టాలి.
2. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్ణయించిన ఫీజులు, కళాశాల, పాఠశాలలో కనీస వసతులు అనుమతులు ప్రైవేటు కళాశాల, పాఠశాలలో అమలయ్యేందుకు బోర్డు అధికారులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులతో కూడిన మానిటరింగ్ కమిటీని వెంటనే ఏర్పాటుచేయాలి. 3. కళాశాల, పాఠశాలలో యాజమాన్యం ముద్రించిన టెస్ట్ బుక్స్, స్టడీ మెటీరియల్, నోట్ బుక్స్ అమ్మకాలను నియంత్రించాలి. 4. ప్రతి కళాశాల, పాఠశాలలో మండల, జిల్లాస్థాయిలో విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు మరియు కళాశాలల యాజమాన్యాలతో కూడిన విద్యా కమిటీలను ఏర్పాటు చేయాలి.
7. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాల, పాఠశాలాల హాస్టలను వెంటనే సీజ్ చేయాలి. కళాశాలల యాజమాన్యాల పై క్రిమినల్ కేసులు బనాయించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు...
ది ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్
........
PMC SMC పేరెంట్ కమిటీ ఎన్నికల 2021 షెడ్యూల్, సూచనలు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీ 2021 (స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు) పూర్తి మార్గదర్శకాలు, తాజా షెడ్యూల్, SMC ఓటర్ల జాబితా ప్రొఫెసర్‌ని ఏర్పాటు చేయడానికి ఎన్నికల నిర్వహణ
PC/SMC కమిటీల ఎన్నికలు 2021 - షెడ్యూల్ విడుదలైంది
AP వివరణాత్మక షెడ్యూల్‌లోని అన్ని పాఠశాలల్లో SMC కమిటీ ఎన్నికలను నిర్వహించడం
పేరెంట్ మానిటరింగ్ కమిటీ 2021 (స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు) పూర్తి మార్గదర్శకాలు, తాజా షెడ్యూల్, SMC ఓటరు జాబితా ప్రొఫార్మా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మార్గదర్శకాలు, PS, UPS, HS కోసం SMC ఎన్నికల ఆహ్వానం, SMC ఎన్నికలను నిర్వహించడానికి నోటీసు, మోడల్ నిమిషాలు ఎన్నికైన సభ్యుల కోసం సమావేశం మరియు ప్రతిజ్ఞ
SE -APSS - పేరెంట్స్ కమిటీల పునర్నిర్మాణం కోసం ఎన్నికలు నిర్వహించడానికి ప్రతిపాదన - ఆమోదించబడింది - Reg.
ప్రస్తావన: DSE & SPD, APSS, ఫైల్ నం: SSA-16021/1/2019-MIS SEC-SSA, కంప్యూటర్ నెం: 970110, dt.26.8.2021.
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, AP మరియు నేను స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, రిఫరెన్స్‌లో పేర్కొన్న పరిస్థితులలో, ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన ప్రభుత్వం, తల్లిదండ్రులను పునర్నిర్మించడానికి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రొజెక్ట్ డైరెక్టర్, APSS కి అనుమతి ఇచ్చింది దిగువ షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర కమిటీలు:
తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ఛైర్మన్ మరియు వైస్ ఛైర్మన్లకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ - 16.09.202110.00 AM
ప్రాథమిక/ ఉన్నత ప్రాథమిక తరగతులు/ ఉన్నత పాఠశాలల నోటీసు బోర్డులో పేరెంట్ కమిటీ సభ్యులకు ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితాను ప్రదర్శించడం -
ఓటరు జాబితాపై అభ్యంతరాలను తెలియజేయడం మరియు ఏదైనా ఉంటే ఫిర్యాదుల పరిష్కారం - 20.09.2021 9AM నుండి 1.00 PM వరకు
పేరెంట్ కమిటీలకు ఎన్నికల ప్రవర్తన కోసం ఓటరు జాబితా ఖరారు మరియు ప్రాథమిక / ఎగువ ప్రాథమిక పాఠశాలలు / ఉన్నత పాఠశాలల నోటీసు బోర్డులో దాని ప్రదర్శన - 20.09.2021 3.00 PM నుండి 4.00 PM GSR INFO- www.gsrmaths.in
పేరెంట్ కమిటీ సభ్యులకు ఎన్నికల నిర్వహణ, ఎన్నుకోబడిన పేరెంట్ కమిటీ సభ్యుల ఖరారు మరియు పేరెంట్ కమిటీల పునర్నిర్మాణం - 22.07.2021 7.00AM నుండి 1.00 PM వరకు
పేరెంట్ కమిటీ సభ్యులు ఛైర్మన్ & వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రవర్తన - 22.07.2021 1.30 PM
పేరెంట్ కమిటీ సభ్యులు, ఛైర్మన్ & వైస్ ఛైర్మన్ చేత ఛైర్మన్ ప్రమాణ స్వీకారం - 22.07.2021 2.00 PM
మొదటి పేరెంట్ కమిటీ సమావేశం నిర్వహించడం - 22.07.2021 3.00PM నుండి 3.30 PM వరకు
అందువల్ల, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, APSS, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
.............
SPS నెల్లూరు జిల్లా
తేది.31.08.2021.
బాలాజీ నగర్ PS, ఆత్మకూరు SDPO ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించిన DIG గారు
పోలీస్ స్టేషన్ లో ఉన్న గత ౩ సంవత్సరాల పెండింగ్ కేసులు, క్రైమ్ రికార్డుల పరిశీలన, సంతృప్తి వ్యక్తం చేసిన DIG గారు.
కోవిడ్ కారణంగా పెండింగ్ కేసులలో విచారణ పూర్తి చేయండి.. అధికారులకు SC/ST, POCSO UI కేసులపై పలు సూచనలు
ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోండి .. కనీస సౌకర్యాలు అందించి, ధైర్యం కల్పించి, సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ఉండాలి..
స్పందన ఫిర్యాదులను ఎటువంటి ఆలస్యం లేకుండా పరిష్కరించండి..
ఆయుధాల లైసెన్స్ కలిగిన వారి కదలికలపై నిఘా ఉంచాలి.. రెన్యువల్ చేయని వెపన్స్ సీజ్ చేయండి
మహిళా పోలీసులు మనలో భాగమే.. వారి యోగ క్షేమాలు మన భాధ్యత.. కలిసి మెలిసి ముందుకెళ్లాలి.. వారి సేవలను వినియోగించుకోండి..
రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు అన్ని విభాగాలతో చర్చిస్తున్నాం.. సమన్వయంగా ముందుకెళ్తాము..
కోవిడ్ నియంత్రణలో పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించడం జరుగుతుంది.
విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ వ్యవస్థను ముమ్మరం చేయాలి...
పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క యోగ క్షేమాలు అడిగి, ఉన్నత విద్యార్హతలు కలిగిన సిబ్బంది పోలీసు శాఖ లో ఉండడం అభినందనీయం.. కోవిడ్ నియంత్రణపై పలు సూచనలు చేసారు..
ఈ రోజు తేది.31.08.2021 న ఉదయం 11.00 గంటలకు నెల్లూరు టౌన్ లోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్, ఆత్మకూరు SDP ఆఫీసులను వార్షిక తనిఖీలలో భాగంగా గుంటూరు రేంజ్ DIG శ్రీ డా. CM. త్రివిక్రమ్ వర్మ,IPS., గారు జిల్లా యస్.పి. శ్రీ CH.విజయ రావు,IPS., గారితో పాటు కలిసి సందర్శించడం జరిగినది.
బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన DIG గారు మొదటిగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఉమెన్ హెల్ప్ డెస్క్ ను సందర్శించి, రిసెప్సనిస్ట్ తో మాట్లాడుతూ.. ఇటీవల నమోదు అయిన ఫిర్యాది యొక్క వివరాలు కనుగొని, ఆ కేసు ఫురోగతి, తదితర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న మొత్తం రికార్డులను FIR ఇండెక్స్, కేసు డైరీలను, రిజిస్టర్ లను రికార్డులన్నీ పరిశీలించారు. పోలీస్స్టేషన్లలో విచారణలో ఉన్న కేసు యొక్క పురోగతి, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నది మొదలగు అంశాలను గూర్చి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. దర్యాప్తులో ఉన్న కేసులలో సత్వరమే దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని, అధికారులకు సదరు కేసులలో తగిన సూచనలు సలహాలను సూచించారు. తదుపరి ఆత్మకూరు SDPO నందు UI లో ఉన్న SC/ST, POCSO, గ్రేవ్ మరియు నాన్ గ్రేవ్ UI కేసులను పరిశీలించి, పెండింగ్ కు గల కారణాలు తెలుసుకుని తగు సూచనలు అందించారు. కోవిడ్ కారణంగా ఆలస్యమైన కేసులను వెంటనే విచారణ పూర్తి చేసి, చార్జ్ షీట్ వేయాలని ఆదేశించారు. మహిళా పోలీసులు పోలీసు శాఖలో భాగమని, వారి యొక్క సమస్యలను పరిష్కరించేందుకు సమయం కేటాయించాలని, వారి సేవలను విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బంది అందరూ కూడా నిబద్ధత కలిగి విధులు నిర్వర్తించాలని, తెలియజేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏయే ప్రాంతాల్లో విధులు నిర్వహించేది, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నది అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ లు, సస్పెక్ట్ లు మరియు పాత నేరస్తుల యొక్క షీట్ లను క్షుణంగా పరిశీలించి, ఎక్కువ నేరాలకు పాల్పడిన రౌడీషీటర్ లలో మంచి నడవడిక ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని సత్ప్రవర్తన కలిగి ఉండకపోతే వారి పైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, సమాజంలో చురుగ్గా వ్యవహరిస్తున్న రౌడీషీటర్ లను గుర్తించి వారిపై నిరంతర ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయలని ఎస్పీ గారు తెలియజేశారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన దిశ యాప్ ను ప్రతి ఒక్క విద్యార్థి, మహిళలు తమ యొక్క ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకునేలా అవగాహన కల్పించాలని మరియు ఉపయోగం గురించి తెలియచేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రత చర్యలను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రెండ్లీ పోలిసింగ్ అమలుపరచాలని, 'స్పందన' ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని, నిర్ణీతగడువులోగా వాటిని పరిష్కరించాలన్నారు. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో DIG తో పాటు జిల్లా యస్.పి. విజయ రావు,IPS., అడిషనల్ యస్.పి.(అడ్మిన్) వెంకటరత్నం, టౌన్ డి.యస్.పి. శ్రీనివాస రెడ్డి, ఆత్మకూరు డి.యస్.పి. వెంకటేశ్వర రావు, యస్.బి. CI -1 ఖాజావళి, CI-2
రామకృష్ణ, బాలాజీ నగర్ CI, ఆత్మకూరు CI, పొదలకూరు CI లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
...........
*ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం.*
*18 ఏళ్లు నిండిన వారు అర్హులు.
కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది.
జనవరి 1,2022 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని పేర్కొంది.
వారితోపాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించారు.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ ఓ ప్రకటన విడుదల చేశారు.
షెడ్యూల్ ఇలా..
► ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31 వరకు ఇంటింటి ఓటరు జాబితా పరిశీలన.
► నవంబర్1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల.
► నవంబర్ 30 వరకు అభ్యంతరాల స్వీకరణకు అనుమతి.
► నవంబర్ 20, 21 తేదీల్లో ఓటరు నమోదుపై ప్రచార కార్యక్రమం.
► అదే తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు.
► ఆ పోలింగ్ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులున్నా సరిచేసుకోవచ్చు.
http://www.nvsp.in లేదా వోటర్ హెల్ప్‌లైన్ అనే మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
► డిసెంబర్ 20 నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తి.
► జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల.
...........
విద్యుత్ శాఖలో ఉద్యోగాల వెలుగులు
జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం
ఏపీఈపీడీసీఎల్ ఐదు సర్కిళ్లలో మొత్తం 398 పోస్టుల భర్తీ
ఒకేషనల్ ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు
మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
అక్టోబర్ 10న రాత పరీక్ష, నవంబర్ 15న తుది జాబితా
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ఎనర్జీ అసిస్టెంట్ (జూనియన్ లైన్‌మెన్ గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. తన పరిధిలోని ఐదు సర్కిళ్లలో మొత్తం 398 పోస్టుల భర్తీకి "https://www.apeasternpower.com/' ఏపీఈపీడీసీఎల్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2019లో భర్తీ చేయగా.. మిగిలిన 398 పోస్టులను ఇప్పుడు భర్తీ చేస్తోంది. ఎలక్ట్రికల్, వైరింగ్ విభాగంలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్ విభాగంలో రెండేళ్ల ఒకేషనల్ ఇంటర్మీడియెట్ కోర్సు చేసిన పురుష అభ్యర్థులు అర్హులు. అలాగే అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. గతంలో పదో తరగతి మార్కుల ఆధారంగా జరిగిన ఎంపిక విధానంలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి రాతపరీక్ష నిర్వహిస్తున్నారు. దీనిలో ఉత్తీర్ణులైనవారిని మాత్రమే శారీరక సామర్థ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)కు పిలుస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇలా..
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 24
► రాత పరీక్ష: అక్టోబర్ 10 (ఉదయం 11 గంటల నుంచి 12.45 గంటల వరకు)
► రాత పరీక్ష ఫలితాలు: అక్టోబర్ 22
► ఫిజికల్ టెస్ట్ (విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ రీడింగ్ చూడటం, సైకిల్ తొక్కడం): నవంబర్ 1 – 6
► ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా: నవంబర్ 15
► నియామక పత్రాలు అందజేత: నవంబర్ 17
► పత్రాలు అందుకున్నవారు ఏఈలకు రిపోర్ట్ చేయాల్సింది: నవంబర్ 29
► ఓరియెంటేషన్ కార్యక్రమం: నవంబర్ 30 – డిసెంబర్ 1 వరకు
► గ్రామ, వార్డు సచివాలయాల్లో సెక్రటరీలకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరిక: డిసెంబర్ 2
0 కామెంట్‌లు