తేది:01-09-2021
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, మహమ్మదాపురం గ్రామంలో దొడ్ల వారి కుటుంబం 1 కోటి 60 లక్షల రూపాయలతో పునర్నిర్మించిన బి.సి.బాలుర వసతి గృహం ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారితో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. .
👉 పొదలకూరు ప్రాంతానికి, నెల్లూరు జిల్లాకి దొడ్ల కుటుంబం అందించిన సేవలు అమోఘం.
👉 జన్మస్థలం, మహమ్మదాపురం గ్రామంలో దొడ్ల సుబ్బారెడ్డి , దొడ్ల చెంచు రామిరెడ్డి తమ తల్లి దొడ్ల శంకరమ్మ జ్ఞాపకార్థం యస్.సి., బిసి, వసతి గృహాలు 60 సంవత్సరాల క్రితం నిర్మించారు.
👉 మహమ్మదాపురం గ్రామంలో ఉన్నత పాఠశాల నిర్మించడంతో పాటు, దానికి అనుబంధంగా వసతి గృహాలు నిర్మించడంతో పేద, దళిత, వెనుకబడిన వర్గాల బిడ్డలు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు.
👉 నెల్లూరుకే తలమానికంగా ఉన్న దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాల, దొడ్ల సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు చేయడంతో, సమాజానికి విద్యా, వైద్యం అందించేందుకు విశేషంగా కృషి చేశారు.
👉 నెల్లూరు జిల్లా కేంద్రంలో దొడ్ల పద్మావతమ్మ గ్రంధాలయాన్ని నిర్మించి, ఎంతో మంది పుస్తక ప్రియులకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలను అందుబాటులోకి తెచ్చారు.
👉 నెల్లూరు పట్టణం, దర్గామిట్టలో దొడ్ల చెంచు రామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెలకొల్పడం ఎంతోమంది పేద విద్యార్థుల పాలిట వరంగా మారింది.
👉 మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశించిన స్థాయిలో ఈ సమాజంలో విద్య వైద్యం అందించడానికి నెల్లూరు జిల్లాలో దొడ్ల కుటుంబం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాయి.
👉 దొడ్ల సుబ్బారెడ్డి, దొడ్ల చెంచు రామిరెడ్డి గార్ల పంథాలోనే నడుస్తూ, దొడ్ల శేషా రెడ్డి గారు తమ పూర్వీకులు నిర్మించిన పాఠశాలలు, వసతి గృహాలు పునర్నిర్మించడానికి ప్రయత్నించడం అభినందనీయం.
👉 దొడ్ల శేషా రెడ్డి గారు చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ఆయన కుమారులు దొడ్ల సుబ్బారెడ్డి, దొడ్ల సునీల్ రెడ్డి సహాయ సహకారాలు మరిచిపోలేనటువంటివి.
👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నాడు-నేడు పథకం కింద స్కూళ్ల అభివృద్ధికోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
👉 జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో మునుపెన్నడూ లేనివిధంగా స్కూళ్ల అభివృద్ధి, పిల్లలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో విద్యావిధానాన్ని కొనసాగించేందుకు అవకాశం కలిగింది.
👉 విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్న దొడ్ల కుటుంబానికి అభినందనలు తెలియజేస్తూ, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
.................
*ఫ్లాష్..2021-22👆 విద్యాసంవత్సరానికి పనిదినాల 31 వారాలనుండి 27 వారాలకు తగ్గిస్తూ*
*3వ తరగతి నుంచి9 వ తరగతి వరకు సిలబస్ 15%*
**10 వతరగతికి 20% కుదిస్తూ ఉత్తర్వులు విడుదల*
..............
సెప్టెంబర్ 25 వ తేదీ మదనపల్లి నుంచి వైజాగ్ వరకు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేయనున్న బస్సు యాత్ర గురించి మరియు ముఖ్య ఉద్దేశం . ముస్లిముల సమస్యలు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు గురించి వైసిపి రాష్ట్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మరియు నారాయణ రెడ్డి అలాగే నాగిరెడ్డి తో రాష్ట్ర కార్యాలయంలో చర్చించడం జరిగింది.
===≠===========
తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర కార్యాలయం తాడేపల్లి పల్లి లో ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న బస్సు యాత్ర కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగినది. కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యులు TD జనార్ధన్ ధన్యవాదాలు.
................................................
నెల్లూరు, సెప్టెంబర్ 1 : జిల్లాలో విద్య, వైద్య రంగాల్లో దొడ్ల కుటుంబం సేవలు ఎనలేనివని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు కొనియాడారు. బుధవారం పొదలకూరు మండలంలోని మహ్మదాపురంలో 1.60 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన దొడ్ల శంకరమ్మ బిసి బాలుర వసతి గృహాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దొడ్ల కుటుంబం స్థాపించిన విద్యాలయాల్లో ఎందరో పేద విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నత స్థానాలు అధిరోహించారన్నారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల, జిల్లా పరిషత్ హైస్కూల్, గాంధీ బొమ్మ సమీపంలోని గ్రంథాలయం, ముఖ్యంగా జిల్లాకే తలమానికమైన దొడ్ల సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాల దొడ్ల కుటుంబం వారి సేవానిరతికి నిదర్శనాలన్నారు. దొడ్ల కుటుంబం వారు వారి పూర్వీకుల ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగడం పట్ల దొడ్ల శేషారెడ్డి, వారి కుమారులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం కూడా విద్యాభివృద్ధికి పెద్దపీట అగ్రతాంబూలం వేస్తుందన్నారు. ప్రతి విద్యార్థి కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అభ్యసించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు-నేడు పథకం ద్వారా జిల్లాలో 1060 పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లను కూడా విద్యార్థులకు అందించినట్లు చెప్పారు. విద్యార్థులంతా కూడా ప్రభుత్వం కల్పించిన పథకాలను వినియోగించుకుంటూ భావిభారత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యను ఒక్కసారి నేర్చుకుంటే మనం మరణించేవరకు కూడా మన తోడుగా నిలుస్తుందని ఒక చిన్న కథ రూపంలో విద్య గొప్పతనాన్ని చిన్నారులకు కలెక్టర్ వివరించారు. శాశ్వతమైన సంపద విద్య మాత్రమేనన్నారు. ఎమ్మెల్యే శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తమకు జన్మించిన గ్రామానికి ఏదైనా చెయ్యాలనే తపనతో పాఠశాల, వసతి గృహాలను ఆనాడే దొడ్ల సుబ్బారెడ్డి, చెంచు రామిరెడ్డి సోదరులు తమ సొంత స్థలం కేటాయించి భవనాలను నిర్మించారన్నారు. ఎందరికో విద్యాదానం, ప్రాణదానం చేసిన చిరంజీవులుగా దొడ్ల కుటుంబ సభ్యులు చరిత్రలో నిలిచిపోతారన్నారు. తమ ముఖ్యమంత్రి కూడా విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించడంతో నాడు అద్వానంగా ఉన్న పాఠశాలలు నేడు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ సాయం అడిగిన దొడ్ల కుటుంబం ముందుంటుందన్నారు. దొడ్ల డెయిరీ చైర్మన్ దొడ్డ శేషా రెడ్డి మాట్లాడుతూ 1960 సంవత్సరంలో తమ పూర్వీకులు కట్టించిన ఈ హాస్టల్ ను 1962 లో ప్రభుత్వానికి అప్పగించామని చెప్పారు. తమ పూర్వీకులు కట్టించిన ఈ హాస్టల్ శిథిలావస్థకు చేరడంతో ఇటీవల తాను గమనించి 1.60 కోట్ల రూపాయలతో ఒక బ్లాక్ ను పూర్తిగా ఆధునీకరించినట్లు చెప్పారు. మరో రెండేళ్లలో మిగిలిన బ్లాక్ లను కూడా పూర్తిస్థాయిలో నూతనంగా నిర్మిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) విజయ్ కుమార్, ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జీవపుత్ర కుమార్, దొడ్ల డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దొడ్ల సునీల్ రెడ్డి, ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ దొడ్ల సుబ్బారెడ్డి, ఎంపీడీవో సుజాత, తహసీల్దార్ ప్రసాదరావు, పొదలకూరు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ డి నరసింహారెడ్డి, మహమ్మదాపురం సర్పంచ్ శ్రీమతి ప్రత్యూష, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు శ్రీ గోగిరెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
................................................
నెల్లూరు, సెప్టెంబర్ 1 : గ్రామస్థాయిలోని సమస్యలను సచివాలయం పరిధిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు సచివాలయ ఉద్యోగులకు సూచించారు. బుధవారం పొదలకూరు మండలంలోని మహమ్మదాపురంలో గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి సమస్యలు మండల, జిల్లా స్థాయికి రాకుండా సచివాలయంలోని పరిష్కార మార్గం చూపాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులు, అనర్హుల జాబితాను ప్రదర్శించాలన్నారు. సచివాలయం పరిధిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసిన ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో చేపట్టనున్న మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 18-45 మధ్య వయస్సు గల మిగిలిన వారందరికీ కూడా వ్యాక్సిన్ వేయించి 100 శాతం పూర్తి చేయాలన్నారు. సచివాలయంలోని రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్, ఎంపిడిఓ సుజాత, తహసీల్దార్ ప్రసాదరావు, మెడికల్ ఆఫీసర్ ఎం రమేష్, సచివాలయ అడ్మిన్
పుష్పలత సిబ్బంది మహాలక్ష్మి, అపర్ణ, శ్రీలత, భారతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
................................................
నెల్లూరు, సెప్టెంబర్ 1 : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలను పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం కావలి ఏరియా ఆసుపత్రిలో అదానీ కృష్ణపట్నం పోర్ట్ గ్రూప్ లిమిటెడ్ సహకారంతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నెల్లూరులోని ఆనం చెంచు సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 100 కోట్ల రూపాయలతో అధునాతన పరికరాలను అమర్చి ఆస్పత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, మరో 100 కోట్ల రూపాయలతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు వేగంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. కరోనా సెకండ్ వేవ్ లో దేశమంతా ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని, అయితే జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం పని చేసిందని ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణపట్నం పోర్టు, శ్రీహరికోటలోని షార్ వారి సహకారంతో అన్ని ఆసుపత్రులకు సరైన సమయంలో ఆక్సిజన్ ను అందించగలిగామని, ఈ సందర్భంగా పోర్ట్ వారికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో లక్షా ఎనభై వేల మంది కరోనా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మెరుగైన వైద్య సేవలందించి వారిని సురక్షితంగా ఇళ్లకు పంపినట్లు తెలిపారు. కరోనా రోగులకు సమయానికి మందులు, ఆహారం అందిస్తూ వైద్య సిబ్బంది మెరుగైన సేవలందించారని, ఇదే స్ఫూర్తితో కరోనా థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను 100 శాతం పూర్తిచేయాలని సూచించారు. మంగళవారం చేపట్టిన మెగా వ్యాక్సిన్ డ్రైవ్ లో ఒక లక్ష 22 వేల మందికి ఒక్కరోజులో వ్యాక్సిన్ వేసి, రాష్ట్రస్థాయిలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ ను, వైద్య సిబ్బందిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కరోనా థర్డ్ వేవ్ ను అరికట్టేందుకు మన ముందున్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్ మాత్రమేనని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలందరూ కూడా అపోహలు వీడి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మరికొన్ని రోజులు అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ కోవిడ్ ను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, అదానీ కృష్ణపట్నం పోర్ట్ గ్రూప్ సీఈవో శ్రీ అవినాష్, ఎపిఎంఎస్ఐడిసి ఈఈ విజయ భాస్కర్, కావలి ఆర్డిఓ శ్రీ శీనానాయక్,డిప్యూటీ ఈఈ సాంబశివరావు, కావలి ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు