ప్రయోక్త మాసపత్రిక

ప్రయోక్త :-

 ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్‌ దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు....!

 

ప్రాథమిక విచారణ చేసి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయండి..సీబీఐకి సుప్రీం ఆదేశం....


న్యూఢిల్లీ :-ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆదిమూలపు సురేశ్‌, ఆయన సతీమణి ఐఆర్‌ఎస్‌ అధికారి టీఎన్‌ విజయలక్ష్మిపై ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని  సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. పబ్లిక్‌ సర్వెంట్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మంత్రి సురేశ్‌ ఆయన సతీమణి విజయలక్ష్మి ఇద్దరూ ఐఆర్‌ఎస్‌ అధికారులు. సురేశ్‌ రాజకీయాల్లోకి వచ్చారు.  ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో సీబీఐ అధికారులు 2016లో దేశవ్యాప్తంగా పలువురు ఐఆర్‌ఎస్‌ అధికారుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో  విజయలక్ష్మిపై కేసు నమోదు చేసి, 2017లో ఎఫ్‌ఐఆర్‌ కట్టారు. దీనిలో విజయలక్ష్మిని ప్రధాన నిందితురాలిగా, సురేశ్‌ను రెండో నిందితునిగా పేర్కొన్నారు. అయితే.. తమపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపలేదని, దీనిని కొట్టి వేయాలని కోరుతూ.. సురేశ్‌ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లలితకుమారి.. ప్రాథమిక విచారణ చేపట్టకుండానే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారని పేర్కొంటూ.. ఫిబ్రవరి 11న దీనిని తోసిపుచ్చింది. అయితే.. ఈ తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై బుధవారం జరిగిన విచారణలో సీబీఐ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఆయా విషయాలను అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. మరోసారి ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది.


............

*రాష్ట్రం లో 5 గురు IAS లకు  జైలు శిక్ష, జరిమానా*

*నెల్లూరు జిల్లా తాళ్ళపాక సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టు సీరియస్*

కోర్ట్ ఆదేశించిన తరువాత కూడా చెల్లింపులు జరపడంలో జాప్యం పై హైకోర్టు ఆగ్రహం.

IAS అధికారుల జీతాల నుంచి కట్ చేసి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశం

రిటైర్డ్ IAS మన్మోహన్ సింగ్ కు నెల జైలు, 1000 జరిమానా

అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబు కు 1000 జెరిమాన, రెండు వారాలు జైలు

Ss రావత్ కు నెల రోజుల జైలు, 1000.ఫైన్

ముత్యాల రాజు కు రెండు వారాల జైలు, 1000 ఫైన్

శిక్ష పై అప్పీల్ చేసుకునేందుకు నెల గడువు ఇచ్చిన కోర్ట్

నెల రోజుల పాటు శిక్ష ను సస్పెండ్ చేసిన న్యాయస్థానం

................



మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై ఇన్‍సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను కొట్టేసిన హైకోర్టు 

గతంలో ఈ కేసులో స్టే ఉండడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం 

సుప్రీంకోర్టులో పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ఏపీ ప్రభుత్వం 

నెల రోజుల్లో కేసును తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు 

జస్టిస్ మానవేంద్రనాథ్‍రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ 

దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై కేసులను కొట్టేసిన హైకోర్టు 

ఎఫ్‍ఐఆర్‍ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు 

అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు


.........


దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి  12వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్  ఆదేశాల మేరకు  నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నందు గల ఆయన విగ్రహానికి నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పి. రూప్ కుమార్ యాదవ్ పూలమాలలు

వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్. సి.పి. నాయకులు పాల్గొన్నారు.

..........


*🟩రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ మరికొంత కాలం పొడిగింపు*

*కొవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ముగిసిన సీఎం జగన్‌ సమీక్ష*

*రాష్ట్రంలో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూ మరికొంత కాలం పొడిగింపు*

*రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు ఉన్న కర్ఫ్యూ కొనసాగింపు*

*వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని నిర్ణయం*

*బహిరంగ స్థలాల్లో విగ్రహాలు వద్దని, నిమజ్జన ఊరేగింపు చేయకూడదని నిర్ణయం*

*ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదు: సీఎం జగన్‌*