ప్రయోక్త మాసపత్రిక

  @    

    కృష్ణా జిల్లా మైలవరంలోని ఎస్ఎస్కే ఆంగ్ల మాద్యమ పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సంచాలకులు ప్రతాప్ రెడ్డి, సంయుక్త సంచాలకులు రామలింగంతో కూడిన అధికారుల బృందం గురు వారం తనిఖీలు నిర్వహించింది. పాఠశాల గుర్తింపు, అనుమతి పత్రాలు, విద్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయుల అర్హతలను అధికారులు పరిశీలించారు. యాజ మాన్యం పాఠశాల ఆవరణలో నివాసం ఉండడాన్ని ప్రశ్నించారు. మూడేళ్ల ఆడిట్ నివేదికను ఇవ్వాలని కోరారు. పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలపై ఎస్కే ఎస్ సంస్థ యజమాని గొల్లపూడి మోహనరావు హైకోర్టులో ఆరు ప్రజాప్రయో జన వ్యాజ్యాలను దాఖలు చేయడంతోనే అధికారులు తనిఖీలు నిర్వహించా రని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమ యంలో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన ఫీజు లపై వేసిన కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. దీంతో తనిఖీల విష యాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది. న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.

........

@@

అధ్వాన్నంగా ఉన్న నెల్లూరు రూరల్ రోడ్లను పరిశీలించిన జనసేన నాయకులు*

*ఫైన్ లు మాత్రమే కాదు సారూ రోడ్లు కూడా వేయండి జగన్ సారూ*

జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్  సూచనలతో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ 

జన్మదిన సందర్భంగా ఆంధ్ర లోని రోడ్ల దుస్థితి గురించి డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా నెల్లూరు రూరల్ లో 2వ రోజు ధనలక్మీ పురం కలివెల పాలెం పల్లిపాలెం,పెనుబర్తి గ్రామాలలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మరియు జనసేన నాయకులు సుజయ్  కలిసి స్థానికులతో రోడ్ల తో తాము పడుతున్న ఇబ్బందుల గురించి విచారించి గ్రామస్థులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని హమీ ఇచ్చారు..

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పెనుపర్తి నడిబొడ్డు లో అయితే సాక్షాత్తు అధికార పార్టీ కార్యాలయం ముందు సచివాలయం సాక్షిగా పాఠశాల పోయే దారి గందరగోళంగా ఉందని సంవత్సరాలు గడుస్తున్నా వాటికి పురోగతి లేదని వాపోయారు పార్టీ సూచనల ప్రకారం ఈరోజు డిజిటల్ క్యాంపెయిన్ జరుగుతుందని ఈ నెల రోజులు గడువు లో ఆ రోడ్లను ప్రభుత్వం గానీ రిపేరు చేయకపోతే జనసేన పార్టీ తరఫున మేమంతా శ్రమదానం చేసి రోడ్ల నిర్మిస్తాం అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు, ఈ సందర్భంగా గ్రామస్థులతో కలిసి *ఫైన్ లు మాత్రమే కాదు సారూ రోడ్లు కూడా వేయండి జగన్ సారూ* అనే నినాదాలతో గుంతల మయం అయిన రోడ్లలో నడిచారు..

........

@@@

*డి‌జి‌పి కార్యాలయం*

*డిజిపి కామెంట్స్*

*జాతీయ స్థాయిలో మరోసారి సత్తాచాటిన  ఏపి పోలీస్ శాఖ*

*అవార్డులను  ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021*

*జాతీయ స్థాయిలో పాస్ పోర్ట్ వెరిఫికేషన్  లో  వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచిన ఎపి పోలీస్.* 

*ఎపిలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పాస్ పోర్ట్ దరఖాస్తు వెరిఫికేషన్ ను   పూర్తి చేస్తున్న పోలీసులు.* 

*టెక్నాలజీ  క్షేత్రం లో జాతీయస్థాయిలో అవార్డులను ప్రకటించిన డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021*

*అత్యంత ఆధునిక టెక్నాలజీ వినియౌగంలో 04  అవార్డులను సొంతం చేసుకున్న ఎపి పోలీసు శాఖ*


*ఈ అవార్డులను పోలీస్ హెడ్  హెడ్క్వార్టర్స్ 3  కైవసం చేసుకోగా, అనంతపురం 01 అవార్డును కైవసం చేసుకుంది.*

*కేవలం స్వల్ప నెలల కాలవ్యవధిలో జాతీయస్థాయిలో అత్యధికంగా  130  అవార్డులను దక్కించుకొని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ.*

 *డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, HAWK, బాడి వొర్న్ కెమెరా స్ట్రీమింగ్,కోవిడ్ ట్రాకర్*లు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి.*

*గతంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ చరిత్రలో  ఎన్నడూ  లేని విధంగా స్వల్ప నెలల వ్యవధిలో  రికార్డ్ స్థాయి  అవార్డులను దక్కించుకున్న  ఏకైక ప్రభుత్వ విభాగం  ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ.*

*దేశం మొత్తం మీద డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021 నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్న శాఖ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ మాత్రమే*

*ఈ అవార్డులు మా బాధ్యత ను మరింతగా పెంచాయి.ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంతో , త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామని, జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు  పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే  సత్ఫలితాలు సాధిస్తున్నామన్న ఎపి డీజీపీ గౌతం సవాంగ్ IPS.*

.......

   @@@@

      జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పనులను మరింత వేగంగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారంలో 2,102 ఇళ్లకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తయిందని, 365 ఇళ్లు బేస్మెంట్ స్థాయి వరకు వచ్చాయని, 108 ఇళ్లు బేస్మెంట్ స్థాయిని దాటి గోడల వరకు, 80 ఇళ్లు పైకప్పు స్థాయి వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాయని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గృహ నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) గ ణేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)  విదేహ్ ఖరె,  నెల్లూరు నగర కమిషనర్  దినేష్ కుమార్, శిక్షణ కలెక్టర్  ఫర్హాన్ అహ్మద్ ఖాన్, జడ్పీ సీఈవో శ్రీమతి సుశీల, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, హౌసింగ్ పీడీ  వేణుగోపాలరావు, డ్వామా పిడి  తిరుపతయ్య, నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, కావలి  ఆర్డివోలు  హుస్సేన్ సాహెబ్, 

 మురళీకృష్ణ, చైత్రవర్షిని, శీనా నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

.........

@@@@@

        సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకుని వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనే 

 దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయితీ నగదును విడుదల చేయడం శుభ పరిణామమని జాయింట్ కలెక్టర్  హరేంధిర ప్రసాద్ అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి రాయితీలు విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 280 చిన్న పరిశ్రమలకు 19.30 కోట్ల రూపాయలను, ఒక మెగా టెక్స్ టైల్ యూనిట్ కు 10.19 కోట్ల రూపాయలను నేడు వారి ఖాతాల్లో సీఎం జమ చేసినట్లు చెప్పారు. ఈ రాయితీలు విడుదల చేయడంతో జిల్లాలోని పరిశ్రమలకు పూర్వవైభవం వచ్చి ఎంతోమంది కార్మికులకు ఉపాధి లభించి, అభివృద్ధి పరంగా జిల్లా ముందంజలో నిలిచేందుకు తోడ్పాటును అందించిన ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డికి జాయింట్ కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్సీ శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర ఎంఎస్ఎంఇ అధ్యక్షులు శ్రీ ఏపీకే రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీ మారుతి ప్రసాద్ రావు, డిప్యూటీ డైరెక్టర్లు షఫీ, వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


లబ్ధిదారుల అభిప్రాయాలు

.................................

ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటా

- టి సులోచన, బివి రబ్బర్ టెక్ పరిశ్రమ, నాయుడుపేట

- నేను నాయుడుపేటలో రబ్బర్ పరిశ్రమను గత కొన్ని ఏళ్లుగా నిర్వహిస్తున్నాను. మావద్ద 20 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమను నిర్వహించడం కష్టంగా మారింది. అలాంటి సమయంలో మీకు నేను ఉన్నాను అంటూ ముఖ్యమంత్రి   వైయస్ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఆదుకునేందుకు ప్రస్తుతం 11 లక్షలు, గత సంవత్సరం 40 లక్షలు మొత్తంగా 51 లక్షల రూపాయలను మంజూరు చేసి మా పరిశ్రమ నిలదొక్కుకునేందుకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. ముఖ్యమంత్రికి జీవితాంతం మేము, మా కార్మికులు రుణపడి ఉంటాము.


పరిశ్రమ బలోపేతానికి రాయితీ నగదు ఉపయోగపడుతుంది

- పెంచలమ్మ, వరసిద్ధి వినాయక ఎర్త్ మూవర్స్, నెల్లూరు

- నేను నా భర్త సహకారంతో నెల్లూరులోని ఆటో నగర్ వద్ద  వరసిద్ధి వినాయక ఎర్త్ మూవర్స్ పరిశ్రమను నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం ప్రభుత్వం వారు నా ఖాతాకు జమ చేసిన 11 లక్షల 50 వేల రూపాయలను పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగించి రెట్టించిన ఉత్సాహంతో పరిశ్రమను ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపిస్తాను.

.......

@@@@@@

*కాకాణి చేతుల మీదుగా తొలి గృహ ప్రవేశం"*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు "వై.యస్.ఆర్.జగనన్న కాలనీ"లో నూతనంగా నిర్మించిన ఇళ్లను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి 

*ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పుణ్యాన 14ఏళ్లుగా బాడుగ ఇళ్లలో ఉన్న తమకు ఇళ్ల స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించి, తమ సొంతింటి కల నెరవేరిందంటూ, భావోద్వేగంతో, ఎనలేని సంతోషంతో చెమ్మగిల్లిన కళ్లతో ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేసిన వీరబాబు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు.*

*వై.యస్.ఆర్.జగనన్న కాలనీలో గృహ ప్రవేశం సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని వీరబాబు దంపతులకు నూతన వస్త్రాలు బహూకరించిన ఎమ్మెల్యే కాకాణి.*

👉 నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిగా ముత్తుకూరు మండల కేంద్రంలో వైయస్సార్ జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించిన గృహాన్ని ప్రారంభించాం.

👉 నెల్లూరు జిల్లాలోనే ఇళ్ల నిర్మాణంలో ముత్తుకూరు మండలం ప్రథమ స్థానంలో ఉండటం సంతోషం.

👉 వైయస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతుంది.

👉 పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు అధికారులు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు.

👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు, అర్హులైన కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేశారు.

👉 పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు.

👉 శరవేగంగా ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు అభినందనలు.

..........

@@@@@@


*💥💥ఫ్లాష్...ఫ్లాష్💥💥*


*జగనన్న విద్యా దీవెన నేరుగా కళాశాల అకౌంట్ లోనే జమ చేయాలి.. గౌరవ హైకోర్టు*


*జగనన్న విద్యా దీవెన విద్యార్థుల తల్లి ఖాతాలో వేయాలని గతంలో ఇచ్చినటువంటి జీవో ని కొట్టివేస్తూ ఆ యొక్క నగదును నేరుగా కళాశాల ఎకౌంట్కి వేయాలని గౌరవ హైకోర్టు తీర్పు నివ్వడం జరిగింది*


*మతుకుమిల్లి శ్రీవిజయ్*

*స్టేట్ లీగల్ అడ్వైజర్*

...........

@@@@@@@


కృష్ణాజిల్లా


ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు,సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్


ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ


విద్యార్థులందరూ మండల కేంద్రమైన ముసునూరు కు చెందినవారు


కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్ లో పెట్టిన ప్రభుత్వ వైద్యులు


పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి మిగతా విద్యార్థులు కూడా కరోనా పరీక్ష నిర్వహిస్తామన్న ప్రధానోపాధ్యాయులు


ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించిన ప్రధానోపాధ్యాయులు..

..........

@@@@@@@@


మాస్క్ ధారణతోనే కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట


- కమిషనర్ దినేష్ కుమార్


ప్రతిఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం నియమాలను పాటిస్తూ, సానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు అని నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కమర్షియల్ షాపులు, దుకాణాల్లో నిర్వాహకులతో పాటు సిబ్బంది కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. వినియోగదారులు కూడా మాస్కు ధరించి క్రయవిక్రయాలు జరపాలని, పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే షాపులపై కార్పొరేషన్ అధికారులు కఠిన చర్యలు తీసుకుని, భారీ జరిమానాలు విధిస్తారని కమిషనర్ హెచ్చరించారు.

..........

@@@@@@@@


నెల్లూరు జిల్లా... కోట మండలం


కోట మండలం చిట్టెడు గ్రామంలో ఉన్న ట్రైబల్ వెల్ ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ పై కరోనా పంజా విసిరింది,సాధారణ పరీక్షల్లో భాగంగా జూనియర్ కాలేజీ విద్యార్థులుకు కరోనా పరీక్షలు జరపగా  నిన్న ఏడు మందికి ఈ రోజు 10మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని  నిర్దారించిన వైద్యులు,వీరిని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లోని ప్రత్యేక కోవిడ్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు...ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు, విద్యార్థులు నెల్లూరు జిల్లా,చిత్తూరు జిల్లా లకు చెందిన వారిని తెలుస్తుంది...

..............

@@@@@@@@@

అమరావతి

నకిలీ చలానాల వ్యవహారానికి సంబంధించి

 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం .

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో నకిలీ చలానాల వ్యవహారంతో మిగతా శాఖల్లోనూ ప్రభుత్వం తనిఖీలు

చలానాల ద్వారా చెల్లించే నగదు సీఎఫ్ఎంఎస్‌కు జమ అవుతుందా లేదా అన్న అంశంపై విచారణ

ప్రజలు చెల్లించే చలానాల నగదు జమ కావడంలో జాప్యం వల్లే అక్రమాలకు ఆస్కారం

ఇప్పటివరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ₹8.13 కోట్ల మేర అవకతవకలు 

 ₹4.62 కోట్ల మేర రికవరీ 

 14 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్

...........

@@@@@@@@@@

*నెల్లూరు జిల్లా..గూడూరు*


*💥కరోనా సోకిన విద్యార్థులను పరామర్శించిన వారికి దైర్యం చెప్పిన  గూడూరు RDO వి.మురళీ కృష్ణ*


చిట్టేడు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడియన్షల్ జూనియర్ కాలేజీలో సుమారు 17 మందికి పైగా   విద్యార్ధులుకు కరోనా సొకగా వారు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లోని కోవిడ్ వార్డులో చేరారన్న సమాచారం మేరకు గూడూరు RDO వి.మురళీకృష్ణ ఆసుపత్రికి చేరుకుని  కొవిడ్ సోకిన విద్యార్థులను పరామర్శించి వారిలో దైర్యం నింపి వైద్యులతో మెరుగైన వైద్యం అందేలా నిరంతరం పర్యవేక్షణ వుండేలా చూడాలని సూచించారు..RDO వి.మురళీ కృష్ణ తో పాటు గూడూరు కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు...


...........

@@@@@@@@@@@

సెప్టెంబ‌రు 13న  ఉద్యాన విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయు - టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

        టిటిడిలోని వివిధ ఆలయాల్లో ఉప‌యోగించిన పూల‌తో స్వామి, అమ్మ‌వార్ల ఫోటోలు, క్యాలండర్లు, కీ చైన్లు, పేపర్  వెయిట్లు తదితరాలు  త‌యారు చేయ‌డానికి డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యంతో సెప్టెంబ‌రు 13వ తేదీ ఎంఓయు కుదుర్చుకుంటామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చెప్పారు. తిరుప‌తి శ్రీ‌ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో శుక్ర‌వారం సాయంత్రం డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి డాక్ట‌ర్ టి.జాన‌కిరామ్‌తో పాటు సంబంధిత అధికారుల‌తో ఈవో స‌మావేశం నిర్వ‌హించారు.

       ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి ఉప‌యోగించి ఫోటోలు, త‌దిత‌రాలు త‌యారు చేయించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ఇందుకోసం తిరుప‌తిలోని ఆ విశ్వ‌విద్యాల‌యంకు చెందిన సిట్రాస్ రిసెర్చ్ స్టేష‌న్‌లో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రూ.83 ల‌క్ష‌ల‌తో ప‌రిక‌రాలు, శిక్ష‌ణ‌కు నిధులు టిటిడి స‌మ‌కురుస్తుంద‌ని దీనికి బ‌దులుగా స్వామివారి ఫోటోలతో పాటు కీ చైన్లు, పేప‌ర్ వెయిట్లు, రాఖీలు, క్యాలండ‌ర్లు, డ్రై  ఫ్ల‌వ‌ర్ మాల‌లు త‌దిత‌రాలు త‌యారు చేసి టిటిడికి ఇస్తార‌ని చెప్పారు. వీటిని భ‌క్తుల‌కు విక్ర‌యించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. 

     ఈ స‌మావేశంలో జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, డిఎల్‌వో శ్రీ రెడ్డెప్ప రెడ్డి, యూనివ‌ర్శిటి డైరెక్ట‌ర్ ఆఫ్ ఎక్స్‌టెన్ష‌న్ డా.బి.శ్రీ‌నివాసులు, రిజిష్టార్ శ్రీ కె.గోపాల్, ప్రిన్సిప‌ల్ సైటిస్ట్ ఆర్‌. నాగ‌రాజు, డెప్యూటీ ఈవో శ్రీ ర‌మ‌ణ‌ప్ర‌సాద్ పాల్గొన్నారు.      

-----------------------


APPTWA.    ....వారి ప్రకటన       



నెల్లూరు జిల్లా ప్రైవేట్ ఉపాధ్యాయులకు            నమస్కారములు.                        


ప్రైవేట్ యాజమాన్యలు రేపు నిర్వహీంచే విద్య సంస్థల బంద్ ను, అంద్రప్రేదేశ్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వెతిరేక్కిస్తు ఈ బంద్ లో ప్రైవేట్ టీచర్స్ ఎవరు పాల్గొనవద్దని పిలుపునిస్తోంది.


అందుకు గల కారణాలు:


1. యజమాన్యాలు ఈ బంద్ ను ఎందుకు నిర్వహిస్తున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు వారి ఇష్టానుసారంగా వసూలు చేసే ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ఒక నియంత్రణ కమిటీని వేసింది. దానికి వ్యతిరేకంగా ఈ బందు ను నిర్వహిస్తున్నారు. ఇందులో వాస్తవాల్ని పరిశీలించినట్లయితే ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులు వసూలు చేయడంలో యాజమాన్యాలకు అభ్యంతరం ఏమిటి? వీరు ఈ విషయం పట్ల హైకోర్టులో కేసును ఫైల్ చేసి కూడా ఉన్నారు. అది కోర్టు పరిధిలో ఉంది ఈ లోపలే వీరికి ఏ అవసరం వచ్చిందని బందును నిర్వహించ తలపెట్టారు.           


2. ప్రియమైన ప్రైవేట్ ఉపాధ్యాయుల రా వాస్తవాలను గమనించండి. ఈ సమస్య ఎవరిది కేవలం యాజమాన్యాల ది మాత్రమే, ప్రైవేటు టీచర్లకి ఫీజుల నియంత్రణ కు ఏమైనా సంబంధం ఉన్నదా  కానీ యాజమాన్యాలకు ఇప్పుడు ఇబ్బంది కలిగిందని మనల్ని ఈ బందులో పాలు పంచుకోమని కోరుతున్నాయి కాదు కాదు అజ్ఞాపిస్తున్నాయి.ఈ రోజు మన సహకారాన్ని కోరే ఈ యాజమాన్యాలు కరోనా సమయంలో మనకు సరైన జీతాలు ఇవ్వక, ఉద్యోగాల నుంచి తొలగించి మన కుటుంబాలని రోడ్డున పడే సాయి అప్పుడు వీరికి మనము గుర్తురాలేదు మనలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వారి కుటుంబాలు చిన్నాభిన్నం అయినాయి. ఈ విషయాలపై మనం అనేక సార్లు యాజమాన్యాలకు తెలియజేసి వారి వారి పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులకు కనీసం నిత్యవసర సరుకులను అందించవలసిందిగా మొరపెట్టుకున్నా వారు స్పందించలేదు.


3. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రైవేట్ టీచర్లకు పిలుపునిస్తోంది మీరు ఎవరో కూడా బందులో పాల్గొన్న వద్దు వారికి సహకరించవద్దు. మూకుమ్మడిగా ఉపాధ్యాయులందరూ రేపు సెలవు పెట్టండి. వారికి మన అవసరాన్ని తెలియజేయండి.


4. యాజమాన్యాలు ఈ బందు నిర్వహణకు బయటకు చెప్పే కారణం ఫీజుల నియంత్రణ మాత్రమే కాదు. ప్రభుత్వం గత సంవత్సరము ప్రైవేటు ఉపాధ్యాయులకు సంబంధించి సర్వీసు రూల్స్ జీవో M.S No  :28 ను తీసుకొని రావడం ద్వారా ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం యాజమాన్యాలపై ఒత్తిడి అని తెస్తున్నది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న యాజమాన్యాలు మన వేలితో మన కంటిని పొడవాలని చూస్తున్నది.


 కనుక ఉపాధ్యాయ సోదరులారా వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే బందులో ను ర్యాలీ లోనూ పాల్గొనవద్దని కోరుతున్నాము.

.........