ప్రయోక్త :-
న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు)

మీరు ఆ పని చేసేసరికి థర్డ్​వేవ్​ కూడా వెళ్లిపోతుంది
కొవిడ్​ డెత్​ సర్టిఫికెట్లకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనలో కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
 మార్గదర్శకాలు వచ్చేసరికి థర్డ్​వేవ్​ కూడా వెళ్లిపోతుందని వ్యాఖ్యానించింది.
కొవిడ్​ మృతుల డెత్​ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 
 మార్గదర్శకాలు రూపొందించే సరికి మూడో దశ కూడా వెళ్లిపోతుందని జస్టిస్​ ఎంఆర్​ షా, అనిరుద్ధా బోస్​తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 సెప్టెంబరు 11 లోగా ఇందుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
 బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా.. కొవిడ్ మరణాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల జారీపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. 
 ఈ మార్గదర్శకాల రూపకల్పన ఆలస్యం కావడంపై దాఖలైన పిటిషన్​ విచారణలో భాగంగా కోర్టు శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
 కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలన్న పిటిషన్​పై సర్వోన్నత న్యాయస్థానం జూన్​ 30న కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 పరిహారానికి సంబంధించి ఎంత మొత్తం చెల్లించగలరో మార్గదర్శకాలు రూపొందించాలని అందులో పేర్కొంది.
......................

@@

ఆధునిక వెట్టి చాకిరి
           పూర్వం 'వెట్టి చాకిరి నేరం ' అనె బోర్డులు MRO ఆఫీస్ దగ్గర ఉండేవి. రాను రాను అది అంతరించి ఆధునికవెట్టిచాకిరి వచ్చింది. అప్పట్లో ఆపనిలో నిరక్షరాస్యులు ఉంటే ఇప్పుడు  అక్షరాస్యులు. అంటే PG / B.Ed చేసిన వారు. మరీ వెట్టి వాళ్ళు అంటే బాగోదని వీళ్ళను ప్రైవేట్ టీచర్స్ /లెక్చరర్స్ అంటారు. వీరు కార్పొరేట్ స్కూల్స్ /కాలేజెస్ లో పనిచేస్తుంటారు. ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు పనిలో ఉండాలి. పొరుగూరివాళ్లయితే ఉదయం 5 కి లేచి రాత్రి 9 కి ఇల్లు చేరతారు. ఈమాత్రానికే ఇంటికి వెళ్లాలా అనవచ్చు. క్యారేజ్ కడుక్కొని రేపటి తిండి తెచ్చుకోడానికి, బట్టలు మార్చుకోడానికి ఇళ్లకు వెళ్తారు.*
 *ఇంతకాలం ఈవింతజీవుల్ని ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళని పనిలో పెట్టుకునేవారు 
ఏదో ఒక రాజకీయపార్టీ కి చెందినవారే వుంటారు. పుట్టాక ప్రతి మనిషి ఎదో ఒక పాపం చేస్తాడు. కాని అత్యంత పాపాత్ములకు పాపాత్ములకు ఈ ఉద్యోగం చేసుకొనే గతి పడుతుంది. ఈ దుర్మార్గులగురించి మాట్లాడటానికి పౌరహక్కులు, మానవహక్కులు, మరి ఏ సంఘాలవారు ముందుకు రారు. ఎందుకంటే వీరు పౌరులు జాబితా లోకి రారు. వీరిని ఎంత కష్టపెట్టిన వీరి ప్రాణం పోదు. మానేద్దాం అనిపించినా ఏపని
రాక మళ్ళీ ఉదయానికి ఈపనిలోకే  వచ్చేస్తారు. మరొక వింత సంగతి ఏంటంటే ప్రతి వృత్తి వారికీ యూనియన్ ఉంటుంది  
కాని వీరికి యూనియన్ ఉండకూడదు. యూనియన్ లో ఉంటే వాడు పాకిస్తాన్ కి రహస్యాలు చేరవేసే దేశద్రోహితో సమానం.* 
*ఈచదువుకున్న వెట్టి  కార్మికులు techno, model, talent, smart, concept, public, olympic, planet, global, asiatic ఇలా రకరకాల ముద్దు పేర్లున్న, పెద్ద పెద్ద అందమైన స్కూల్స్, కాలేజ్  లో పనిచేస్తుంటారు. వీరి  జీతం, జీవితం మాత్రం అంద వికారం గా ఉంటాయి.*
 *వీరి విధులు....*
*1.రోజుకి 10 నుండి 12 గంటలు విరామం లేకుండా పని చెయ్యాలి.* 
*2.ఉదయం time కి రావాలి. బయోమెట్రిక్, late rigister, 1, 2 సార్లు లేట్ అయితే ఒక లీవ్ గా పరిగణిస్తారు. కానీ... కానీ... ఇంటికి వెళ్ళేటప్పుడు time చూడకూడదు. Time కి  పంపరు. ఏవేవో మీటింగ్స్ ఉంటాయి. పైన ఆపైన గవర్నమెంట్ పేర్లు ఎరువు తెచ్చుకొని పెట్టుకొన్న 90% చదువులేని ఆఫీసర్స్ వుంటారు. Deen, queen, GM, AGM, AM, PM, RM.... ఇలా. వీరు ఈ మీటింగ్స్ లో ఈ కార్మికుల్ని నోటికొచ్చినట్టు చీకటి పడేదాకా తిడుతూ బాగా ఉతికి గెంజి పెట్టి ఆరేస్తూ వుంటారు.*
*3.వీళ్లకు demo తీసుకొని అందరు ok అన్నకే ఉద్యోగం ఇస్తారు కాని ప్రతిరోజూ ప్రతివారం feedback తీసుకుంటారు. Feed back సరిగా లేకపోతే అర్ధాంతరంగా ఇంటికే. విచిత్రం ఏంటంటే feed back విద్యార్థులకు ఉండదు. వాడు class లో ఏవిధంగా ఉండాలి సత్ప్రవర్తన, నీతి నియమాలు, మర్యాద,గురువులపై  గౌరవం  ఇవేమి అక్కర్లేదు. వాడికి 100   కి 101 marks వచ్చేస్తే చాలు.విద్యార్థుల మనోభావాలు దెబ్బతినకుండ వాడు ఎంత పనికిమాలిన వాడైనా తిట్టకుండ  వేరే స్కూల్ కి జారిపోకుండా చూసుకుంటే చాలు. ఎందుకంటే యాజమాన్యాల దృష్టిలో డబ్బు తెచ్చేది వాడు (స్టూడెంట్ )డబ్బు పట్టుకెళ్ళేది వీడు (teacer).*
*4.ఈ పాఠాలు చెప్పే వెట్టి కార్మికులు పొరపాటున కూడా  కూర్చోకూడదు (కుర్చీలుండవులే )గోడకు ఆనుకోకూడదు. ఎప్పుడైనా desk మీద ఆనుకుంటే CC cams లో చూసి పిల్లలెదురుగానే పశువుల్ని కసిరినట్టు కసురుతారు. ఏదైనా శారీరక బలహీనత చెప్తే నీకు ఉద్యోగం ఎందుకు పోయి పడుకో అంటారు. అందుకే ఇలాంటి వాళ్ళ తలనొప్పి లేకుండా ఈ భావి భారత పౌరులను తీర్చిదిద్దే వంకన విద్యా వ్యాపార పరిశ్రమలు పెట్టిన దేశోద్ధారకులు 40/45 వయస్సు దాటిన వారికీ ఉద్యోగాలు ఇవ్వమంటున్నారు. 'Above 45 need not apply' అని ఉంటుంది. అప్పుడే PG చేసినవారు, బ్రహ్మచారులైతే ఎంతసేపైనా ఎద్దులా నుంచుని, ఒంటెలా నీళ్లు లేకపోయినా ఉండగలరు, గాడిదలా పేపర్ కట్టలు /బుక్స్  మోయగలరు, గుర్రంలా ఎన్ని అంతస్థులైన ఎక్కి దిగగలరు, కోతిలా బ్రాంచ్ to బ్రాంచ్ transfers కి గెంతగలరు.*
*5.ఏదైనా గవర్నమెంట్ హాలిడే /పండగ వస్తే staff మాత్రం రోజంతా institution    లోనే ఉండాలి. Sunday వర్క్ చేయాలి. నెలకు 1 సెలవు అంతకు మించితే జీతం cut. కొన్ని సంస్థలు ఎక్కువ జీతం ఇస్తున్నట్లు రిజిస్టర్ లో sign చేయించి తక్కువ ఇస్తారు. అడిగే దమ్ము ఎవరికీ ఉండదు. ఎందుకంటె feed back బాగాలేదని వంకతో ఉద్యోగం తొలగిస్తారు.*
*6.మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టు ఈ వెట్టిపనివారికి అసలు సిసలు పరీక్ష ఏంటంటే campaigning. అంటే పచ్చిగా చెప్పాలంటే  అడ్మిషన్ల యాచన. ఇంత చదువు చదివి అందరి కొంపలకు వెళ్లి పేరెంట్స్ పట్టించుకున్నా‌ లేకపోయినా మీ పిల్లల్ని మా school /college లో join చెయ్యండి అని వాళ్ళ కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలి బుట్టలో వెయ్యాలి. ఒక్కోసారి వారు పనిచేసే సంస్థలో గొప్పదనం లేకపోతే, ఇతర సంస్థ దరిద్రపుగొట్టుది, అక్కడ బాగాచెప్పరు అని అడ్డమైన అబద్దాలు చెప్పి ఎలాగైనా వాళ్ళని దారికి తేవాలి. వడగాల్పు కొట్టి ముఖాలు వాడిపోయినా, లోపల కడుపు మండిపోతున్నా, పేరెంట్స్ అగౌరవం గా మాట్లాడితే చిరునవ్వు పులుముకోవాలి. ఎందుకంటె స్టూడెంట్స్ join అవ్వకపోతే job లేదు. March, April పిల్లలకు కాదు, వీరికి పరీక్షా సమయం. విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలి. పోనీ ఈ సంస్థలో మానేసి మరో చోట join అయితే? 🤔పెనం మీదనుండి పొయ్యిలో పడినట్లుంటుంది 😭.*
*7.కొసమెరుపు ఏంటంటే ఈ modern bonded laborer కి year లో ఒకసారి పెద్ద పండగ చేస్తారు. ఆరోజు ఎప్పుడు నమస్కారం చెప్పడం తెలియని విద్యార్థులు వీళ్లకు wish చేస్తారు. ఆరోజు classes ఉండవ్. Students gifts కొనిస్తారు. కుర్చీల్లో కూర్చోపెట్టి, దండలు వేసి ఆ రోజే టీచర్ లా చూస్తారు. ఎందుకంటె అది సెప్టెంబర్ 5 teachersday కాబట్టి. 
*మంచి   జీతాలిచ్చి గౌరవంగా చూసే సంస్థలు లేకపోలేదు. చాలా అరుదు.*
..........

*ఢిల్లీ*
*దేశంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నికల షెడ్యూల్ విడుదల*
*పశ్చిమ బెంగాల్‌లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానం*
*బెంగాల్‌లో భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలు*
*ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు*
*సెప్టెంబర్ 30న పోలింగ్, అక్టోబర్ 3న కౌంటింగ్*
*ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6*
*నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 13*
 *హుజురాబాద్  , బద్వేలు ఉప ఎన్నికలు వాయిదా...!* 
*కరోన కారణంగాఉప ఎన్నికల వాయిదా - ఎన్నికలు సంఘం*

పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించండి
- కమిషనర్ దినేష్ కుమార్ 
నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ దినేష్ కుమార్ కోరారు. రెవెన్యూ కలెక్షన్స్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా  శనివారం నగరంలోని వివిధ కమర్షియల్ ప్రాంతాల్లోని పన్ను బకాయిదారుల షాపులను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి పన్ను ద్వారా ప్రజలు చెల్లించే ఆదాయం పైనే నగర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం సాధ్యం అవుతుందని, నగరపాలక సంస్థ సిబ్బంది జీతాలు కూడా వాటి పైన పూర్తిగా ఆధారపడి ఉన్నందున ప్రజలంతా సకాలంలో తమకు చెందిన ఆస్తి పన్నులను చెల్లించాలని సూచించారు. మొండి బకాయి దారుల వివరాలను పూర్తిగా సేకరించి ఇక నుంచి ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆయా బకాయిదారుల షాపులను జప్తు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
*"ఆసుపత్రి అభివృద్ధి సమావేశం నిర్వహించిన కాకాణి"*
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
*స్క్రోలింగ్ పాయింట్స్:*
 ఆసుపత్రి అభివృద్ధి కోసం, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే వారికి వసతి, సదుపాయాల కల్పన కోసం కమిటీ సభ్యులు, వైద్యులు, సిబ్బందితో చర్చించి, అనేక నిర్ణయాలు తీసుకున్నాం.
 పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ద్వారా కోవిడ్ సమయంలో విశేష సేవలందించి అనేక మంది ప్రాణాలు కాపాడగలిగాం.
 కోవిడ్ సమయంలో సమర్థవంతంగా పని చేసిన వైద్యులు, సిబ్బంది, అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
 సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు అన్ని వసతి సదుపాయాలు కల్పించడంతోపాటు,విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
 పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం 
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన *"కాయకల్ప"* అవార్డు చేజిక్కించుకోవడం సంతోషం.
 నియోజకవర్గంలోని మరొక ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయిలో గుర్తింపును పొందడం అభినందనీయం.
 కోవిడ్ మూడో విడత సంకేతాలు వెలువడుతున్న దృష్ట్యా ఆస్పత్రిలో అవసరమైన ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాం.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కోవిడ్ నేపథ్యంలో ఆసుపత్రికి అవసరమైన సిబ్బందిని నియమించి, కరోనా సోకిన వారికి సేవలు అందించేందుకు వెసలుబాటు కల్పించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మొదటి విడత, రెండో విడత సమయంలో వరుసగా సమీక్షలు నిర్వహించి, కరోనా వ్యాధి నయం చేయడానికి అవసరమైన మందులను ఆస్పత్రులకు చేర్పించారు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల ద్వారా అధికార పార్టీ శాసన సభ్యునిగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో చికిత్స కోసం వస్తున్నవారికి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలందిస్తున్నాం.
 సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, పనితీరు పట్ల అన్ని వర్గాల ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేయడం సంతోషం.
ప్రభుత్వం కల్పిస్తున్న వనరులతో పాటు, ఆసుపత్రి అభివృద్ధి నిధులను ఆసుపత్రి అభివృద్ధి కోసం వెచ్చించి, చికిత్స కోసం  వచ్చే ప్రతి ఒక్కరికి సమగ్రమైన, సంపూర్ణమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం.

విజ‌య‌న‌గ‌రం...... రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన జ‌గ‌న‌న్న అంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంలో ఆశాజ‌న‌క ఫ‌లితాలు సాధించాలంటే అధికారులు, ప్రజాప్ర‌తినిధుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం అవ‌స‌ర‌మ‌ని విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి పేర్కొన్నారు. విజ‌య‌న‌గ‌రం అర్బ‌న్ ప‌రిధిలోని జ‌గ‌న‌న్న కాల‌నీల్లో జ‌రిగే ఇళ్ల నిర్మాణాలు, ఇత‌ర ప్ర‌క్రియ‌ల‌పై క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో జేసీ హౌసింగ్ అధ్య‌క్ష‌త‌న శ‌నివారం స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో కార్పొరేట‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధులు, హౌసింగ్ అధికారులు పాల్గొని ప‌నుల పురోగ‌తికి అనుస‌రించాల్సిన విధానాల‌పై చ‌ర్చించారు.
ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ వైకాపా ప్ర‌భుత్వం ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కోర్చి ప్ర‌తి పేద కుటుంబానికి సొంతిల్లు ఇవ్వ‌డానికి సంక‌ల్పించింద‌ని పేర్కొన్నారు. జ‌గ‌న‌న్న కాల‌నీల్లో త్వ‌రిత‌గ‌తిన ప‌నుల‌ను పూర్తి చేసి ఇళ్లు ఇవ్వ‌డానికి ప్ర‌త్యేక దృష్టిసారించి ఒక ఐఎఎస్ అధికారిని కూడా కేటాయించింద‌ని గుర్తు చేశారు. అయితే ప్ర‌స్తుతం అక్క‌డ‌ ఇళ్ల నిర్మాణాల‌కు సంబంధించి కొన్ని సాంకేతిక స‌మస్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని, వాటిని అధిగ‌మించి ముందుకెళ్లాల్సిన బాధ్య‌త ఇటు అధికారుల‌పై, అటు ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఉంద‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నుంచి వచ్చే నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చేర‌టం లేద‌ని, దీని ప‌రిష్కారానికి జేసీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. అలాగే లేఅవుట్ల‌లో క‌నీస వ‌స‌తులు క‌ల్పించాల‌ని, ఎవ‌రైనా వెళ్లిన‌ప్పుడు ఉండ‌టానికి, కూర్చోడానికి అనువుగా షెడ్డు ఎదైనా నిర్మించాల‌ని, తాగునీరు, మ‌రుగుదొడ్ల వ‌స‌తి క‌ల్పించాల‌ని సూచించారు. అద‌న‌పు సిబ్బందిని, అధికారుల‌ను నియ‌మించేందుకు చర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వానికి నివేదించాల‌ని కోరారు.
జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) మ‌యూర్ అశోక్ మాట్లాడుతూ జ‌గ‌న‌న్న కాల‌నీల్లో త్వ‌రిత‌గ‌తిన ఇళ్ల నిర్మాణాలు జ‌రిగేందుకు అన్ని ర‌కాలు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ల‌బ్ధిదారుల నుంచి వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను స్వీక‌రించేందుకు ప్ర‌త్యేకంగా జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. అలాగే ప‌ట్ట‌ణం నుంచి లేఅవుట్ల వ‌ర‌కు ప్ర‌త్యేకంగా ఆర్టీసీ బ‌స్సు న‌డిపేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాల‌కు సంబంధించిన ప్ర‌తి స‌మాచారాన్ని ప్ర‌జాప్ర‌తినిధుల‌కు, హౌసింగ్ క‌మిటీ స‌భ్యుల‌కు చేరేలా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వివ‌రించారు. ఇంకా కాల‌నీల్లో జియో ట్యాగింగ్ ప్ర‌క్రియ పూర్తి కావాల్సి ఉంద‌ని త్వరిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌ను జేసీ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల‌కు సంబంధించిన విధివిధానాల‌పై, నిబంధ‌న‌ల‌పై ల‌బ్ధిదారుల‌కు మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. గంద‌ర‌గోళ ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా అధికారులు, ప్రజాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని పేర్కొన్నారు. 
కార్య‌క్ర‌మంలో హౌసింగ్ పీడీ ర‌మ‌ణ‌మూర్తి, విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌లక్ష్మి, డిప్యూటీ మేయ‌రులు కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, ఇషరపు రేవతీదేవి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్‌.ఎస్‌. వ‌ర్మ‌, హౌసింగ్ క‌మిటీ స‌భ్యులు యస్.వి.వి. రాజేశ్‌, తవిటిరాజు, శ్రీ‌నివాస్‌, ముర‌ళీ, కార్పొరేట‌ర్లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.
.............



 : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకుని వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనే  దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి   వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయితీ నగదును విడుదల చేయడం శుభ పరిణామమని జాయింట్ కలెక్టర్  హరేంధిర ప్రసాద్ అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి రాయితీలు విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్  హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 280 చిన్న పరిశ్రమలకు 19.30 కోట్ల రూపాయలను, ఒక మెగా టెక్స్ టైల్ యూనిట్ కు 10.19 కోట్ల రూపాయలను నేడు వారి ఖాతాల్లో సీఎం జమ చేసినట్లు చెప్పారు. ఈ రాయితీలు విడుదల చేయడంతో జిల్లాలోని పరిశ్రమలకు పూర్వవైభవం వచ్చి ఎంతోమంది కార్మికులకు ఉపాధి లభించి, అభివృద్ధి పరంగా జిల్లా ముందంజలో నిలిచేందుకు తోడ్పాటును అందించిన ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డికి జాయింట్ కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్సీ శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర ఎంఎస్ఎంఇ అధ్యక్షులు  ఏపీకే రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీ మారుతి ప్రసాద్ రావు, డిప్యూటీ డైరెక్టర్లు షఫీ, వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

 జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద ఉలవపాళ్ల, మొగళ్లూరు, నువ్వురుపాడు, యోగేశ్వరుని పురం, తిమ్మాజీ కండ్రిక  గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూముల రీసర్వేకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్   హరేంధిర ప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో భూ సమస్యలపై ఆర్డివోలతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భూముల రీ సర్వే సమర్థవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మొబైల్ తహసీల్దార్ ను నియమించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రీసర్వేలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సూచనలు, సలహాలు తెలపాలని ఆర్డీవోలకు సూచించారు. అలాగే భూములకు సంబంధించి కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల వివరాలపై అధికారులతో చర్చించారు.  ఈ సమావేశంలో  జిల్లా రెవెన్యూ అధికారి 
 చిన్న ఓబులేసు, సర్వే  ల్యాండ్స్ ఎడి     హనుమాన్ ప్రసాద్, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, ఆత్మకూరు, కావలి ఆర్డివోలు    హుస్సేన్ సాహెబ్,  మురళీకృష్ణ,  సరోజినీ, కుమారి చైత్రవర్షిని,  శీనా నాయక్, సంబంధిత తహసీల్దార్  వెంకటేశ్వర్లు, దగదర్తి, చిల్లకూరు, ఆత్మకూరు తహసీల్దార్లు 
పాల్గొన్నారు.

భారత జాతి ఐకమత్యమే అన్నింటికన్నా ముఖ్యం: ఉపరాష్ట్రపతి పిలుపు
తద్వారా ప్రపంచ ఐకమత్యం, విశ్వమానవ సౌభ్రాతత్వానికి బాటలు వేయాలి
పాశ్చాత్యదేశాల ఆలోచనలను, వలస పాలకుల ఆలోచనలను అనుసరించేకంటే స్వతంత్ర విధానాలతో ముందుకెళ్లాలని యువతకు పిలుపు
వైభవోపేతమైన భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికతే మూలాధారం.. ఆధ్యాత్మిక చేతనను జాగృతం చేయడం తక్షణావసరం
శ్రీ అరబిందో 150వ జయంతి ప్రారంభోత్సవం సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
ప్రపంచమంతా అరబిందో బోధనలు, ఆలోచనల సందేశాన్ని విస్తరింపజేయాలని సూచన
విద్యార్థులకు బాల్యం నుంచే ఆధ్యాత్మిక ఆదర్శాలను బోధించాలని సూచన
హైదరాబాద్ సెప్టెంబర్ 4, 2021

భారతదేశాన్ని కుల, మత, ప్రాంత, భాష, వర్ణ, జాతి ఆధారంగా విడదీయాలని చూస్తున్న దేశ విభజన శక్తులతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య సంబరాలను జరుపుకుంటున్న ఈ సమయంలో.. అలాంటి జాతివ్యతిరేక శక్తులను తుదముట్టించడం ద్వారా దేశ ఐకమత్యానికి కృషిచేయడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. 
శ్రీ అరబిందో 150వ జయంత్యుత్సవాల ప్రారంభ సూచకంగా హైదరాబాద్‌లోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ అరవిందుల వారికి ఆయన నివాళులు అర్పించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అన్న ఉపరాష్ట్రపతి, ఈ ఆదర్శాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ భారతదేశ భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా, గౌరవప్రదంగా చేయడంలో దేశ యువత ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని సూచించారు. దేశంలో శాంతి, సామరస్యాలను కాపాడాలన్నారు.
భారతదేశ సంస్కృతికి మన ఆధ్యాత్మికతే మూలమన్న ఉపరాష్ట్రపతి, మన ఆధ్యాత్మికతతో ప్రపంచానికి వెలుగులు పంచేందుకు శ్రీ అరవిందుల వారు విశేషమైన కృషిచేశారన్నారు. ప్రస్తుత ప్రపంచానికి ఆధ్యాత్మిక చేతన ఎంతో అవసరమని, ఇందుకోసం శ్రీ అరవిందులవారి స్ఫూర్తితో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. మన దైనందిన జీవితంలోనూ ఆధ్యాత్మికత ఎంతో ప్రశాంతతను ఇస్తుందన్నారు. భారతగడ్డపై పుట్టిన యువతలో సహజంగానే అపారలమైన శక్తిసామర్థ్యాలున్నాయని,వాటిని గుర్తించి, ఆ సామర్థ్యానికి సరైన పదునుపెట్టి, స్వతంత్ర ఆలోచనలతో పురోగతి సాధించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. పాశ్చాత్య పద్ధతులను అనుసరించేకంటే మనవైన ఆలోచనలతో ముందుకెళ్లడమే మన అస్తిత్వాన్ని ఘనంగా ప్రపంచానికి చాటిచెబుతుందన్నారు. ఈ దిశగా యువత ఆలోచన చేయాలన్నారు.
ఘనమైన భారతదేశ చరిత్రను పునర్లిఖించాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. మన విలువైన సంస్కృతి, సంప్రదాయాలను యావత్ ప్రపంచం స్వాగతిస్తోందని, అది మనకు గర్వకారణమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆ గౌరవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడాన్ని కూడా యువత బాధ్యతగా తీసుకెళ్లాలన్నారు.
శ్రీ అరవిందుల వారు గొప్ప యోగి, తత్వవేత్త, కవి, స్వాతంత్ర్య సమరయోధుడిగా మనకెంతో స్ఫూర్తిని పంచారన్న ఉపరాష్ట్రపతి, తన రచనల ద్వారా మనలో సంపూర్ణ స్వాతంత్ర్య భావనను మనలో రగిలించడంతోపాటు, ఆధ్యాత్మిక భావనను జాగృతం చేయడం ద్వారా మనలో నిరంతరం కొత్తశక్తిని సృష్టించుకునేందుకు మార్గదర్శనం చేశారని గుర్తుచేశారు.
1947లో భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతజాతిని ఉద్దేశించిన శ్రీ అరవిందులవారు ఇచ్చిన సందేశాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, మానవ నాగరికత అభివృద్ధిలో ఆసియా ప్రాంతం కీలకపాత్ర పోషించాలని, స్వయం సమృద్ధితో సమైక్య భారతదేశం, ఆసియా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలంటూ అభిలషించిన విషయాన్ని గుర్తుచేశారు. వ్యక్తిగతంగా, సామాజికంగా, దేశంగా మనమంతా ఐకమత్యంతో, జాతీయవాదంతో, ఆధ్యాత్మిక భావనతో ముందుకెళ్లడమే ఇందుకు సాధనమన్న శ్రీ అరవిందుల వారి మాటలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.
నేడు విశ్వమానవాళి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శ్రీ అరవిందులవారు సూచించినట్లుగా ఆధ్యాత్మిక చేతన, సచేతనత్వమే సరైన మార్గదర్శనం చేస్తుందని, పుదుచ్చేరిలో ‘అరోవిల్లే’ను శ్రీ అరవిందులవారు ఏర్పాటుచేయడమే ప్రపంచ ఐకమత్యం కోసం వారి ఆలోచనకు నిదర్శనమన్నారు. శ్రీ అరవిందుల వారి స్వప్నాన్ని సాకారం చేసేందుకు యువత కృషి చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. 
విద్యాభ్యాసం కేవలం ఉద్యోగాన్వేషణ కోసమో, జీవనోపాధి కోసమో కాకూడదని, విజ్ఞాన సముపార్జన, మాతృభూమికోసం పనిచేయడం, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడమే విద్య ద్వారా మనకు అలవడాలన్న శ్రీ అరవిందుల వారి స్వప్నాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ దిశగా, విద్యార్థుల్లో చదువుతోపాటు నైతికత, ఆధ్యాత్మికతతోపాటు సామాజిక బాధ్యత వంటి వాటిని బోధిస్తున్న శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్కృషిని ఆయన అభినందించారు. 
భారతీయ ప్రాచీన విజ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడంలో ఉపాధ్యాయులదే కీలకమైన పాత్ర అని ఉపరాష్ట్రపతి సూచించారు. విలువలతో కూడిన విద్య ద్వారానే భారతదేశం తన సంపూర్ణ శక్తిసామర్థ్యాలను తెలుసుకోగలుగుతుందన్నారు. 
శ్రీ అరవిందుల వారి జీవితం, సందేశాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శనను ఏర్పాటుచేసిన పాఠశాల యాజమాన్యాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. కార్యక్రమం ప్రారంభంలో శ్రీ అరవిందుల జీవితాన్ని ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించిన విద్యార్థులను వేదికపైకి పిలిచి మరీ ఉపరాష్ట్రపతి అభినందించారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక ఒడిశా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీరామచంద్రుడు తేజావత్, మణిపూర్ విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య తిరుపతి రావు, పాఠశాల అధ్యాపకులు, పలువురు విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.



          రేషన్ కార్డులలో బయోమెట్రిక్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సభ్యుడు ఉండే రేషన్ కార్డుదారులకు ఒక వేళ వారి బయోమెట్రిక్ పడకపోతే మాత్రమే వాలంటీర్ ల 
బయోమెట్రిక్ తో సరుకులు ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఇక రేషన్ కార్డులో ఒకరి కంటే 

ఎక్కువ మంది ఉంటే ఒకరి బయోమెట్రిక్ రాకపోతే మరొకరి బయోమెట్రిక్ ను ఉపయోగించి సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్ విధానంలో కొన్ని సార్లు వేలిముద్రలు పడకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఒకే సభ్యుడు ఉండి వేలు ముద్ర పడకపోతే సరుకులను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది...!!_