స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్. ఎస్‌బీఐ మరింత సులభంగా బ్యాంకింగ్ సేవల్ని అందిస్తోంది. గతంలో బ్యాంకింగ్ సేవలు (Banking Services) పొందాలంటే ఖాతాదారులు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ టెక్నాలజీని ఉపయోగించుకొని అనేక సేవల్ని ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నాయి బ్యాంకులు. కొన్ని సేవలకు అసలు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో నుంచే బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్ కూడా అవసరం లేదు. ఫీచర్ ఫోన్ ఉన్నా చాలు. పలు రకాల బ్యాంకింగ్ సేవలు లభిస్తాయి. ఎస్‌బీఐ తమ కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవల్ని సులభంగా అందించేందుకు ఇటీవల కాంటాక్ట్ సెంటర్ సర్వీస్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఎస్‌బీఐ అప్‌గ్రేడ్ చేసిన కాంటాక్ట్ సెంటర్‌తో 30 పైగా బ్యాంకింగ్ సేవల్ని ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో పొందొచ్చు. 12 భాషల్లో ఈ సేవలు లభిస్తాయి. 24 గంటల పాటు ఈ సేవలు పొందొచ్చు. ఇందుకోసం రెండు టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది ఎస్‌బీఐ . 1800-1234 లేదా 1800-2100 నెంబర్లకు కాల్ చేసి కస్టమర్లు బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డ్, చెక్ బుక్, ఎమర్జెన్సీ సర్వీసెస్, డిజిటల్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన సమాచారం... ఇలా అనేక రకాల సేవలు టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి పొందొచ్చు.