ఇకపై నాగ్ పూర్ నుంచి పూణె ప్రయాణం ఎనిమిది గంటలు పడుతుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం నాగ్ పూర్ నుంచి పూణెకు ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు కలుగుతున్న అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకుని, నాగ్ పూర్- ముంబై సమృద్ధి మహామార్గ్ ను ఛత్రపతి ‌ శంభాజీనగర్ (ఔరంగాబాద్) సమీపంలో నూతనంగా ప్రతిపాదించిన పూణె- ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) ఆక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఎక్స్ ప్రెస్ వే తో అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. ఈ రహదారిని జాతీయ రహదారి అథారిటీ ఆఫ్ ఇండియా పూర్తి సమలేఖనంతో నిర్మిస్తుందని తెలిపారు.