....ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ చత్తీస్ గఢ్ లలో ఒక్కొక్కటి చొప్పున ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉత్తర ప్రదేశ్ లోని ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, బీహార్, చత్తీస్ గఢ్ లో ఖాళీగా ఉన్న కింది పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల నిర్ణయించింది. వరస నెం. రాష్ట్రం పేరు పార్లమెంటరీ నియోజక వర్గం సంఖ్య/పేరు 1. ఉత్తరప్రదేశ్ 21- మెయిన్ పురి (పి సి) వరస నెం. రాష్ట్రం పేరు అసెంబ్లీ నియోజక వర్గం సంఖ్య/పేరు 1. ఒడిశా 01- పడంపూర్ 2. రాజస్థాన్ 21-సర్దార్షహర్ 3. బీహార్ 93-కుర్హాని 5. చత్తీస్ గఢ్ 80-భానుప్రతాప్పూర్ (ఎస్టీ) ఉత్తర ప్రదేశ్ 37-రాంపూర్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది: అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఎన్నికల ప్రక్రియ నిర్ణీత తేదీలు గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ 10 నవంబర్, 2022 ((గురువారం) నామినేషన్ల చివరి తేదీ 17 నవంబర్, 2022(గురువారం) నామినేషన్ల పరిశీలన తేదీ 18 నవంబర్, 2022 (శుక్రవారం) నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 21 నవంబర్, 2022(సోమవారం) పోలింగ్ తేదీ 5 డిసెంబర్ 2022(సోమవారం) కౌంటింగ్ తేదీ డిసెంబర్ 8, 2022(గురువారం) ఎన్నికల ప్రక్రియ ముగిసే తేదీ డిసెంబర్ 10, 2022 (శనివారం) ఓటర్ల జాబితాలు 01.01.2022 అర్హత తేదీలతో 5 జనవరి, 2022న ప్రచురితమైన, నామినేషన్లు వేయడానికి చివరి తేదీ నాటికి నవీకరించబడిన ఓటర్ల జాబితాల ఆధారంగా పైన పేర్కొన్న పార్లమెంటరీ/అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఉప ఎన్నికలు జరుగుతాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు), వీవీప్యాట్ లు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ ఉప ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను ఉపయోగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచామని, ఈ యంత్రాల సాయంతో ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఓటర్ల గుర్తింపు ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్) అనేది ఓటరును గుర్తించే ప్రధాన డాక్యుమెంట్. అయితే, దిగువ పేర్కొన్న ఏదైనా గుర్తింపు పత్రాలను కూడా పోలింగ్ స్టేషన్ వద్ద చూపించవచ్చు: *ఆధార్ కార్డు, *ఎం ఎన్ ఆర్ ఇ జి ఎ జాబ్ కార్డు, *ఫోటోగ్రాఫ్ కలిగిన బ్యాంక్/పోస్టాఫీస్ పాస్ బుక్ లు, *కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేయబడ్డ ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, *డ్రైవింగ్ లైసెన్స్, *పాన్ కార్డ్, *ఎన్ పిఆర్ కింద ఆర్ జిఐ ద్వారా జారీ ఆయన స్మార్ట్ కార్డు, *ఇండియన్ పాస్ పోర్ట్, *ఫోటోగ్రాఫ్ తో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, *కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/పిఎస్ యులు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఉద్యోగులకు జారీ చేయబడ్డ ఫోటోగ్రాఫ్ తో కూడిన సర్వీస్ గుర్తింపు కార్డులు, *ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు. *యూనిక్ డిసెబిలిటీ ఐడి (యు డి ఐ డి) కార్డు, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ప్రవర్తనా నియమావిని (iమోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) 29, జూన్, 2017 నాటి కమిషన్ ఆదేశాల నెంబరు. 437/6/1NST/2016-CCS (కమిషన్ వెబ్ సైట్ లో లభ్యం అవుతుంది)ద్వారా జారీ ఆయన పాక్షిక సవరణకు లోబడి, ఎన్నికలు జరిగే పార్లమెంటరీ/అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం లేదా ఏదైనా భాగాన్ని కలిగిన జిల్లా(లు)లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తక్షణం అమల్లోకి వస్తుంది నేర చరిత్ర పూర్వాపరాలకు సంబంధించిన సమాచారం నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు ప్రచార కాలంలో మూడు పర్యాయాలు వార్తాపత్రికలు , టెలివిజన్ ఛానెళ్ల ద్వారా దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రచురించాల్సి ఉంటుంది. నేర చరిత్ర ఉన్న వారిని పోటీకి నిలిపే రాజకీయ పార్టీ తన అభ్యర్థుల నేర నేపథ్యం గురించిన సమాచారాన్ని తన వెబ్ సైట్ లో , ఉంచడంతో పాటు వార్తాపత్రికలు , టెలివిజన్ ఛానళ్లలో మూడు సందర్భాల్లో- ఉపసంహరించుకున్న మొదటి 4 రోజుల్లోపు , తరువాత 5 నుంచి 8వ రోజు మధ్య.9వ రోజు నుంచి ప్రచారం చివరి రోజు వరకు (పోలింగ్ తేదీకి రెండో రోజు ముందు) (ఉదాహరణ: ఉపసంహరణకు చివరి తేదీ నెల 10 , పోల్ ఆ నెల 24న ఉన్నట్లయితే, డిక్లరేషన్ ప్రచురణ కోసం మొదటి బ్లాక్ నెల 11 నుంచి 14వ తేదీ మధ్య చేయబడుతుంది, రెండో , మూడవ బ్లాక్ లు వరసగా ఆ నెల 15 నుంచి 18 నుంచి 19- 22వ తేదీల మధ్య ఉండాలి.) ప్రచురించాల్సి ఉంటుంది. 2015 రిట్ పిటిషన్ (సి) నెం. 784 (లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్) , రిట్ పిటిషన్ (సివిల్) నెం. 536 ఆఫ్ 2011 (పబ్లిక్ ఇంటరెస్ట్ ఫౌండేషన్ అండ్ ఓఆర్ఎస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఎఎన్ ఆర్) లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ ఆవశ్యకత ఉంది. ఈ సమాచారం 'మీ అభ్యర్థులను తెలుసుకోండి' అనే పేరుతో ఉన్న యాప్ లో కూడా లభ్యం అవుతుంది. ఉప ఎన్నికల సమయంలో కోవిడ్ సంబంధిత ఏర్పాట్లు దేశవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితిలో మొత్తం మెరుగుదల దృష్ట్యా , డిఎం చట్టం కింద ఎన్ డి ఎం ఏ/ ఎస్ డి ఎం ఏ ఆంక్షలను ఉపసంహరించుకున్న దృష్ట్యా, భారత ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసిన సలహాలను ఈ ఉపఎన్నికల సందర్భంగా పాటించాలని నిర్ణయించారు.ఉప ఎన్నికల ప్రక్రియ సమయంలో, టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ ఇంకా కోవిడ్ సముచిత ప్రవర్తనకు కట్టుబడి ఉండటం అనే ఐదు అంచెల వ్యూహంపై నిరంతరం దృష్టి పెడతారు. జిల్లా యంత్రాంగం కోవిడ్ పరిస్థితిని సమర్థవంతంగా పర్యవేక్షించాలి అవసరమైన చట్టపరమైన / పరిపాలనా నిబంధనలను సూచించడం ద్వారా కోవిడ్ సముచిత ప్రవర్తన నిబంధనలను అమలు చేయాలి.