ప్రయోక్త:-     నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ నందు శనివారం జిల్లా కలెక్టర్     కె.వి.ఎన్.చక్రధర్ బాబు ఆధ్వర్యంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు సంబంధించి మాస్టర్ ట్రైనర్స్ కి మొదటి విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి లోక్ సభ ఎన్నికల నిర్వహణలో మాస్టర్ ట్రైనర్స్, పి.ఓలు, ఎ.పి.ఓ లు ఎంతో కీలకమని.., అందువల్ల ప్రతి ఒక్కరూ ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.


ఈ శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్      కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ.., ఎన్నికల నిర్వహణలో మాస్టర్ ట్రైనర్స్ నిబద్ధతతో పనిచేయాలని, పి.ఓ లు, ఎ.పి.ఓ లకు ఎన్నికలకు సంబంధించి శిక్షణా బాధ్యతలు కూడా తీసుకోవాలని అన్నారు. మానవ తప్పిదాల కారణంగా రీపోలింగ్ జరిగే పరిస్థితి రానివ్వరాదని స్పష్టం చేశారు. ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు పనిచేయాలన్నారు. లోక్ సభ ఉప ఎన్నిక ఈ.వి.ఎం మిషన్ల ద్వారా జరుగుతున్నందును ఎన్నికల సిబ్బంది అందరూ ఓటింగ్ యంత్రాలు, వివిపిఎటిలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమర్ధులైన వారిని పోలింగ్ బృందంలో నియమించుకుని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు.  కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని, కోవిడ్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు తగిన విధంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని మాస్టర్ ట్రైనర్లను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలో పాటించాల్సిన నిబంధనలు, పోలింగ్ అనంతరం ఈవీఎం మిషన్లను స్ట్రాంగ్ రూంలకు తరలించే సమయంలో తీసుకోవాల్సిన అన్ని చర్యల గురించి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఛాలెంజ్ ఓటింగ్, రహస్యంగా ఓటు వేసే పద్దతి, ఓటు వేయరాదని ఓటర్ నిర్ణయించుకుంటే ఆ సమయంలో పాటించాల్సిన విధి, విధానాలు, ప్రాక్సీ ఓటింగ్ పై మాస్టర్ ట్రైనర్స్ కి అవగాహన కల్పించిన కలెక్టర్.., ప్రతి ఒక్కరూ ఇది తమ మొదటి ఎన్నిక అన్నవిధంగా బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలకు, వివిపిఎటి లకు తప్పని సరిగా నిబంధనల ప్రకారం సీల్ వేయాలని, ఎలక్షన్ పేపర్లు అన్ని సీల్ వేసి ఈవీఎంలతో పాటే స్ట్రాంగ్ రూంకి చేర్చాలని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలవాలన్నారు. ఈవీఎంలు, వివిపిఎటి ల హ్యాడ్లింగ్ పై పి.ఓ లు, ఎ.పి.ఓలకు పూర్తి అవగాహన కలిగేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్ కుడిచేయి ఫోర్ ఫింగర్ కి ఓటర్ మార్క్ వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని, ఈ నిబంధనను పోలింగ్ రోజున అనుసరించాలన్నారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, కోవిడ్ వలన హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వొచ్చని ఈసీ నిబంధనలు ఉన్నాయని, నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ అందించేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. 


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ)      హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ( ఆసరా)     టి.బాపిరెడ్డి, మున్సిపల్ కమిషనర్    దినేష్ కుమార్, గూడూరు సబ్ కలెక్టర్   ఆర్.గోపాల కృష్ణ, ఆర్.డి.ఓ లు, మాస్టర్ ట్రైనర్స్, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.