ప్రయోక్త :-  నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ నందు ఆర్&బి స్పెషల్ సెక్రటరీ   అర్జా శ్రీకాంత్, జిల్లా కలెక్టర్               కె.వి.ఎన్.చక్రధర్ బాబుతో కలిసి.., ఆర్.డి.ఓ లు, రెవెన్యూ, ఆర్. అండ్.బి అధికారులతో జిల్లాలో జరుగుతున్న ఆన్ గోయింగ్ అభివృద్ధి పనులపై సమీక్షా, సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులు, రైల్వే, కృష్ణపట్నం పోర్టు కనెక్టివిటీ పనుల పురోగతి, భూసేకరణపై సమీక్ష నిర్వహించిన స్పెషల్ సెక్రటరీ.., జిల్లా కలెక్టర్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పోర్టుల కనెక్టివిటీ ప్రాజెక్టులపై దృష్టి సారించిందని, జిల్లా కలెక్టర్ సహకారంతో ఆ దిశగా పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులకు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు.


ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్     కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ... NHAI ప్రాజెక్టుల భూసేకరణ విషయంలో జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని.., ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయడానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. వి.సి.ఐ.సి ప్రాజెక్టులతో పాటు.., జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు భూసేకరణ చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు.., జిల్లాలో 6 లైన్ల జాతీయ రహదారి పనులు పూర్తి కాలేదని, దీనివలన అధిక ట్రాఫిక్ నెలకొందని.., 6 లైన్ల జాతీయ రహదారి పనులు పూర్తి చేయాలని కోరారు. దగదర్తి ఎయిర్ పోర్టు- రోడ్డు కనెక్టివిటీపై స్పెషల్ సెక్రటరీకి వివరించిన కలెక్టర్, ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయడంలో సహకారం అందించాలన్నారు.


TR&B, స్పెషల్ సెక్రటరీ    అర్జా శ్రీకాంత్ గారు మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో నిత్యం రద్దీగా వుండే మన పాత పెన్నా బ్రిడ్జికి అనుబందంగా నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం జిల్లా మంత్రి అనిల్ కుమార్ పంపిన ప్రతి పాదనకు, మోర్త్ సెక్రటరీ వెంటనే డీపీర్ లు సిద్ధం చేయమని జాతీయ రహదారుల విభాగం వారిని ఆదేశించినట్లు తెలిపారు. అందుకు అవసరమైన స్థల సేకరణను సకాలంలో  పూర్తి చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ను కోరారు.


రీజినల్ ఆఫీసర్ ఎస్.కె. సింగ్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం జరిగిన సి.యఫ్.సి మీటింగ్ లో దుత్తలూరు - కావలి జాతీయ రహదారి NH 167 BG, విస్తరణ ప్రాజెక్ట్ ను ఆమోదించినట్లు తెలిపారు, అందుకు కావలసిన స్థల సేకరణ ను వెంటనే మొదలు పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ ని కోరారు.


ఈ సమావేశంలోజాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ)    హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, ఆర్.ఓ లు ఆర్.కె.సింగ్, ఎస్.కె. సింగ్, ఆర్.డి.ఓ లు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.