పన్ను బకాయిదారుల ఆస్థులు వేలం వేస్తాం
నెల్లూరు కమిషనర్ దినేష్ కుమార్
ప్రయోక్త :- ఈ ఆర్ధిక సంవత్సరం 2020 -21 కి నెల్లూరు నగర పాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్థి పన్నులు చెల్లించని మొండి బకాయిదారుల ఆస్తులను జప్తు చేసి, వేలం వేస్తామని నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. కార్యాలయంలోని సమావేశ మందిరంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ పన్నుల చెల్లింపు ఆలస్యం చేసేకొద్దీ అసలుపై రెండు రూపాయల మేరకు వడ్డీరేటు విధిస్తామని, వడ్డీ మాఫీ ఎట్టి పరిస్థితుల్లో జరగదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు నగరంలో సుమారు వంద మందికి పైగా బకాయిదారులకు ఆస్థి జప్తు నోటీసులు జారీ చేశామని, నిర్దేశించిన సమయంలోపు వారు పన్నులు చెల్లించకపోతే ఆస్తులను వేలం వేసి బకాయిలు రాబడుతామని కమిషనర్ హెచ్చరించారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్థి పన్నులను ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పిస్తామని, పెరిగిన నూతన పన్నులకు బదులుగా గతేడాది ఆస్థి పన్నులనే ఏప్రిల్ మాసంతం వరకు పరిగణలోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
0 కామెంట్‌లు